»   » చిరూ చిందేస్తే.. 3 గంటల్లో దుమ్ము లేచిపోయింది ...., టాలీవుడ్ చరిత్రలో ఇదే టాప్ రికార్డు...

చిరూ చిందేస్తే.. 3 గంటల్లో దుమ్ము లేచిపోయింది ...., టాలీవుడ్ చరిత్రలో ఇదే టాప్ రికార్డు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి.. టాప్ హీరోగా దాదాపు మూడు దశాబ్దాలు టాలీవుడ్‌ సుల్తాన్ గా ఒక వెలుగువెలిగాడు. తొమ్మిదేళ్ల క్రితం.. రాజకీయాల్లోకి వెళ్లడంతో మెగాస్టార్ సందడిలేక వెండితెర చిన్నబోయిందనే చెప్పాలి. అయితే, ఆ విరామానికి చెక్ పెడుతూ.. ప్రస్తుతం 'ఖైదీ నం 150'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్. కథ, దర్శకుడు, హీరోయిన్ ఎంపిక విషయాల్లో తడబాటు, షూటింగ్ మందగించడం.. మరో వైపు బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుండడంతో మెగా సినిమాపై నెగటివ్ కామెంట్లు వినిపించాయి. ఈ కామెంట్ల నేపథ్యంలోనే శుక్రవారం ఖైదీ నం 150 టీజర్ విడుదలైంది. విడుదలవుతూనే.. ఈ టీజర్ సృష్టించిన రికార్డులు గమనిస్తే.. చిరుకు ఇష్టమైన డైలాగ్ 'బాక్స్ బద్దలవుద్ది' గుర్తుకు రాక మానదు.

తొమ్మిదేళ్ళ లాంగ్ గ్యాప్ తరవాత తెరకెక్కిన 'ఖైదీ నం 150' చిరు పర్ఫామెన్స్ లోను, ఇటు ఫ్యాన్స్ టేస్ట్ లోను క్వాలిటీ తగ్గలేదని ప్రూఫ్ చేసింది.మోస్ట్ అవెయిటింగ్ మెగా ఎంటర్ టైనర్ 'ఖైదీ నం 150' టీజర్ రిలీజయి గడిచింది కొన్ని గంటలే అయినా, సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. టీజర్ రిలీజయిన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటేశాయి. గంట గంటకి పెరుగుతున్న యూ ట్యూబ్ వ్యూస్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యాన్స్ పై చూపిన ఇంపాక్ట్ నంబర్స్ లో తెలుస్తుంది. ఎందుకంటే విడుదలైన మూడు గంటల ఐదు నిమిషాల్లోనే ఈ టీజర్‌కు పదిలక్షల వ్యూస్ ఇది మామూలు విషయం కాదు రాబోయే మెగా తుఫాన్ ఎలా ఉండబోతోందో ఇదోక శాంపిల్ అనుకోవచ్చేమో .. టాలీవుడ్ చరిత్రలో ఇదే టాప్ రికార్డు. ఈనెల 8 సాయంత్రం రిలీజ్ చేసిన‌ ఖైదీ నెం 150 టీజ‌ర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ రిలీజ్ చేసిన 3 గంట‌ల 5 నిమిషాల్లో 1 మిలియ‌న్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఏదైనా న‌చ్చితేనే చేస్తాను...న‌చ్చితేనే చూస్తాను.

కాద‌ని బ‌ల‌వంతం చేస్తే...కోస్తా...ఎ స్వీట్ వార్నింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్ మాస్ కి బాగా క‌నెక్ట్ అవుతుంది. ఈ టీజ‌ర్ లో చిరు లుక్స్ చూస్తుంటే... 1990 టైమ్ లో చూసిన మెగాస్టార్ ని చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది అంటూ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఆడియోను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. గతంలో రికార్డు మెగా హీరో రామ్‌చరణ్ చిత్రం ధృవపై ఉంది. ఈ సినిమా టీజర్ విడుదలైన 4.30గంటల్లో పదిలక్షల వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ 'ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ టీజర్'గా ఖైదీ రికార్డులు సృష్టించింది. ఎన్నాళ్ళు తెరకు దూరంగా ఉన్నా... అభిమానుల గుండెలకు మాత్రం దగ్గరగానే ఉన్నడన్నమాట మెగాస్టార్ .

English summary
The 45-second long teaser featured the Megastar in a massy look, which was a visual treat for Chiranjeevi's fans. In just three hours of its release, the teaser has created a record. Yes, Khaidi No.150's teaser has clocked in 1 million views in just 3 hours and 5 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu