»   » ఖైదీ నెంబర్ 150 ఇక హ్యాండ్ గివింగేనట., కారణాలు తెలుసా?

ఖైదీ నెంబర్ 150 ఇక హ్యాండ్ గివింగేనట., కారణాలు తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నెంబర్ 150 సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా అభిమానులకు థాంక్స్ గివింగ్ పేరిట ఓ భారీ ఫంక్షన్ చేయాలనుకున్నారు మెగాస్టార్ అండ్ రామ్ చరణ్. ఈ మేరకు వార్తలు వచ్చేసాయి. ఒకటి రెండు డేట్లు కూడా బయటకు వచ్చేసాయి. కానీ మరి ఏమయిందో? ఇప్పుడు ఆ ఫంక్షన్ ఊసే ఎక్కడా బయటకు రావడంలేదు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో...మెగా స్టార్ చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ విజయంలో తన ఫ్యాన్స్ పాత్ర ఎంతో ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఫ్యాన్స్ కోసం ఓ మెగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అంటూ చెప్పిన మెగా టీమ్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయినట్టు ఉండిపోయారు.

విశాఖ లో చేయాలని మొదట అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే బెటర్ అని డిసైడ్ అయ్యారు. అసలు జనవరి 28నే చేద్దామనుకున్నారు. కానీ వాయిదా వేసారు. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ గివింగ్ మీట్ జరపాలని మెగాస్టార్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యారు.అంటూ వార్తలు వరుసగా వచ్చాయి ఒక దశలో. అయితే అనుకోకుండా అంతలోనే ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో మరోసారి పోరాటం మొదలైంది. దాంతో ఆ థాంక్స్ గివింగ్ సెరెమనీ వాయిదా పడింది.


khaidi No 150 Thanksgiving Meetcancelled?

పరిస్థితి కాస్త సద్దుమణిగాకా ఆ కార్యక్రమం నిర్వహిద్దాం అని అనుకున్నారట చిరంజీవి. కానీ ఇంతలోనే దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో మరోసారి తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారట.దీనికితోడు ఈమధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి చిరంజీవి పవన్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ ప్రస్తావన అటు మీడియా నుండి ఇటు మెగా అభిమానుల నుండి బహిరంగంగా ప్రస్తావనకు వస్తే దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలియని పరిస్థుతులు కూడ ఈ థాంక్స్ గివింగ్ మీట్ వాయిదాకు కారణం అని అన్నారు.


అయితే ఇప్పుడు ఫంక్షన్ చేసే మూడ్ నుంచి మెగాస్టార్ అండ్ చరణ్ దూరమైనట్లు తెలుస్తోంది. మరీ కావాలనుకుంటే యాభై రోజులు దాటిన తరువాత ఆలోచిద్దాం అని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ థాంక్స్ గివింగ్ మీట్ వల్ల ఈసినిమాకు కలక్షన్స్ పరంగా ప్రత్యేక ప్రయోజనాలు కూడ ఏమిలేని నేపధ్యంలో ఈ మీట్ ఆలోచనలను ఇంచుమించు మెగా కాంపౌండ్ అటక ఎక్కించినట్లే అని అంటున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ థాంక్స్ గివింగ్ మీట్ పై దృష్టి పెట్టెకన్నా తన కొత్త మూవీ 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' స్క్రిప్ట్ గురించి మరింత లోతైన చర్చలు జరపడం మంచిది అన్న ఆలోచనలలో ప్రస్తుతం మెగా కాంపౌండ్ ఉంది అని టాక్.. అయినా సినిమా విడుదలకు ముందు అభిమానులు, ఇతరత్రా వ్యవహారాలు అవసరం కానీ, ఇప్పుడు కలెక్షన్లు అన్నీ అయిపోయిన తరువాత ఫంక్షన్ చేస్తే ఏంటీ? చేయకపోతే ఏంటీ. మీరేమంటారు?

English summary
khaidi no 150 makers are planned to celebrate the success of the Movie with fans by holding a thank you meet, to thank the audiences and fans for giving such a big hit. The latest updates coming in reveal us that the event might be cancelled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu