»   » ప్రిన్స్ మహేష్ ఖలేజా రిలిజ్ ఫంక్షన్ ని అత్యంత వైభవంగా..!

ప్రిన్స్ మహేష్ ఖలేజా రిలిజ్ ఫంక్షన్ ని అత్యంత వైభవంగా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూడు సంవత్సరాల తర్వాత ప్రిన్స్ మహేష్ ఖలేజా సినిమా ద్వారా తన అభిమానుల ముందుకి రాబోతున్నారు. మహేష్ కి ఒక్కడు, అతడు, పోకిరి లాంటి బంపర్ బ్లాస్టర్ హిట్ లు ఇచ్చిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించారు. ఎప్పడూ మహేష్ బాబుకి ప్రత్యేకంగా కొంచెం శ్రద్దతో సంగీతాన్ని అందించే మణిశర్మ ఈ చిత్రానికి కూడా కేక పెట్టించేలాగా మ్యూజిక్ అందించారని సమాచారం. వీటితోపాటు టోటల్ షూటింగ్ వర్కు అంతా పూర్తిఅయి, శరవేగంగా పోస్ట్ ఫ్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న మహేష్ ఖలేజా సినిమాని అక్టోబర్ 7న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు శింగనమల రమేష్ బాబు వెల్లడించారు. దానితో పాటు సెప్టెంబర్ 26న ఆడియో ఫంక్షన్ రిలీజ్ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 26న జరిగబోవు ఆడియో రిలీజ్ ఫంక్షన్ హక్కులను ఎన్ టీవి వారు కైవసం చేసుకొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu