»   » రవితేజ ‘కిక్-2’ ఆడియో వేడుక (ఫోటోస్)

రవితేజ ‘కిక్-2’ ఆడియో వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ కిక్ టీమ్ తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్-2'. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం హైదరాబాద్ లో జరిగింది.

ఈకార్యక్రమంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, రవితేజ, కళ్యాణ్ రామ్, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, రవికుమార్ చౌదరి, రకుల్ ప్రీత్ సింగ్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, వక్కతం వంశీ, రామ్ లక్ష్మణ్, బ్రహ్మానందం, రాజ్ పాల్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సమీర, పృథ్వి, షేర్ నిర్మాత కొమురం వెంకటేష్, శ్రీమణి, బాంబే బోలే, వరికుప్పల యాదిరిగి, పరుచూరి ప్రసాద్, గౌతం రాజు, బాబీ దితరులు పాల్గొన్నారు.


ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రకిల్ ట్రైలర్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేసారు. ఆడియో సీడీలను మరో అతిథి జూ ఎన్టీఆర్ ఆవిష్కరించారు. తొలి సీడీని మాస్ మహరాజా రవితేజకు అందించారు. ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...


సీడీ ఆవిష్కరణ

సీడీ ఆవిష్కరణ

కిక్-2 ఆడియో వేడకలో బిగ్ సీడీనీ ఆవిష్కరిస్తున్న జూ ఎన్టీఆర్


ప్రముఖులు

ప్రముఖులు

ఈ ఆడియో వేడుకకు బోయపాటి శ్రీను, జూ ఎన్టీఆర్ ముక్య అతిథులుగా హాజరయ్యారు. ట్రైలర్ బోయపాటి ఆవిష్కరించగా, ఆడియ సీడీలను ఎన్టీఆర్ ఆవిష్కరించారు.


తొలి సీడీ

తొలి సీడీ


కిక్ 2 ఆడియో సీడీలను ఆవిష్కరించిన ఎన్టీఆర్ తొలి సీడీ రవితేజకు అందజేసారు.


కిక్-2

కిక్-2

రవితేజ,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వంక్కతం వంశీ, సంగీతం: ఎస్ఎస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి


మరిన్ని ఫోటోల కోసం..

మరిన్ని ఫోటోల కోసం..

మరిన్ని ఫోటోల కోసం..


English summary
Photos of Telugu movie Kick 2 Audio Release at Hyderabad on May 9th , 2015.
Please Wait while comments are loading...