»   » రికార్డ్: నాలుగు రోజుల్లోనే 100 కోట్లు వసూలు!

రికార్డ్: నాలుగు రోజుల్లోనే 100 కోట్లు వసూలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో సూపర్ హిట్ అయిన రవితేజ 'కిక్' చిత్రాన్ని బాలీవుడ్లో సల్మాన్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియావాలా ఈచిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకుడిగా సాజిద్ నడియావాలాకు ఇదే తొలి సినిమా. సల్మాన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది.

ఈద్ పండగను పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన రోజు హిట్ టాక్ రావడంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేసారు. కానీ అంతకంటే వేగంగా కేవలం నాలుగు రోజుల్లోనే ఈచిత్రం 100 కోట్ల వసూళ్లూ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం దాదాపు 5000 వేల థియేటర్లలో విడుదలైంది.

Kick movie 4 days box office collections 100 cr

గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా మూడు రోజులకు 83 కోట్ల 73 లక్షలు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోందని చిత్ర దర్శకుడు సాజిద్ నదియావాలా చెబుతున్నారు. ఇక సోమవారం ఈ చిత్రం రూ. 20 కోట్ల పైనే వసూలు చేసింది. మొత్తం నాలుగు రోజుల్లో 100 కోట్ల మార్కును క్రాస్ అయింది. సినిమా ఫలితాలపై దర్శక నిర్మాత సాజిద్ నడియా వాలా సంతోషంగా ఉన్నారు.

కిక్ సినిమా విడుదలైన రోజు సెలవు దినం కాకపోయినా..., వర్షాలు కురుస్తున్నా మా చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి. వినూత్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది అన్నారు. తొలి రోజు 26 కోట్ల 4లక్షలు, రెండవ రోజు 27 కోట్ల 15 లక్షల. మూడవ రోజు 30 కోట్ల 18 లక్షలు, నాలుగవ రోజు రూ. 20 కోట్ల పైచిలుకు వసూలు అయ్యాయి.

English summary
Salman Khan starrer bollywood movie 'Kick' 4 days box office collections 100 cr.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu