twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సంతృప్తిని కలిగించింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ‘కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను హతమార్చుతున్నట్లు తాను నటించిన సన్నివేశాలు తనకు సంతృప్తిని కలిగించాయని కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో తయారైన ఇటీవల తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

    గతంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో సంచరిస్తూ గంధపు చెక్కల స్మగ్లర్‌గా గుర్తింపు పొందిన వీరప్పన్‌పై ఈ చిత్రం రూపొందింది. అప్పట్లో ప్రముఖ సినీనటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందే. కిడ్నాప్‌కు గురైన రాజ్‌కుమార్‌ కుమారుడు శివరాజ్‌కుమార్‌ ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్ర పోషించారు.

    చిత్రంలో నటించిన అనుభవాలను ఆయన మీడియాలతో పంచుకున్నారు. తన తండ్రిని కిడ్నాప్‌ చేసిన వైనాన్ని చిత్రంలో పూర్తిస్థాయిలో వివరించలేదన్నారు. కాని వీరప్పన్‌ను తాను హతమార్చినట్లు చిత్రీకరించిన సన్నివేశాలు మాత్రం అందరినీ ఆకట్టుకొనేలా ఉన్నాయన్నారు. నిజజీవితంలో లభించని న్యాయం నాకు సినిమా ద్వారా దక్కడం సంతృప్తిని కలిగించిందన్నారు.

    Killing Veerappan Movie gave satisfaction to Me

    తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... జనవరి 1న విడుదల కావాల్సిన కిల్లింగ్‌ వీరప్పన్‌ సెన్సార్ ప్లాబ్లం తో రిలీజ్ కాలేదు. కాని కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు వెర్షన్ ని ఈ నెల ఏడవ తేదీన విడుదరిలీజ్ అవ్వడం లేదు.

    రియలిష్టిక్ గా తీసిన ఈ సినిమా స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సంగతీ తెలిసిందే. శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, సంచారి విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించింన ఈ సినిమా కన్నడంలో మాత్రం ఈరోజే విడుదలవుతోంది.

    గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ , అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందింది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

    వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

    ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కిందని వర్మ ఈ సందర్భంగా గతం లో తెలిపిన సందతి తెలిసిందే.

    English summary
    Relief for the audience is that of ‘Hat-Trick’ hero Dr Shivarajkumar avenging the kidnapping of his super star father Dr Rajkumar, on the big screen playing the smart spy cop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X