twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో ఈ నెల 7న ‘కిల్లింగ్ వీర‌ప్ప‌న్’!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ పై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం కిల్లింగ్ వీర‌ప్ప‌న్. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి ఆర్ పిక్చ‌ర్స్ మ‌రియు జెడ్ త్రీ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ల‌పై ఈ చిత్రాన్నిబీవీ మంజునాథ్, ఇ.శివ‌ప్ర‌కాష్‌, బి ఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు.

    ఈ జనవరి 1న కన్నడ, తెలుగు వెర్షన్లలో రిలీస్ అవ్వాల్సిన 'కిల్ల్లింగ్ వీరప్పన్ ' కన్నడ వెర్షన్ రిలీస్ అయ్యి, తెలుగు వెర్షన్ మాత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీచేసే ప్రాసెస్ లో ఉన్న కొన్ని టెక్నికల్ కారణాల వల్ల డిలే అవ్వడం జరిగింది..దాని మూలాన సినిమా పోస్ట్ పోన్ చెయ్యడం జరిగింది ...ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని జనవరి 7న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని నిర్మాత‌లు తెలిపారు. కన్నడలో రిలీస్ అయ్యిన వెంటనే విశేష ఆదరణ పొందిన 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం పై అక్కడి ప్రముఖ సినీ విశ్లేషకులు మరియు థియేటర్ లోంచి బయటికి వచ్చే ప్రేక్షకులు వెల్లడించిన అభిప్రాయాలు.

    Killing Veerappan releases on January 7

    చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ సెల్యులాయిడ్ పై తనదైన స్టైల్ లో మరో కల్ట్ మూవీని ఆవిష్కరించారు. వీరప్పన్ గా నటించిన సందీప్ మరియు కాప్ లో రోల్ లో నటించిన శివరాజ్ కుమార్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు తాను మాత్రమే చేయగలనని మరోసారి నిరూపించారు. ముఖ్యంగా బ్యాక్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్కలకి చాలా పేరొచ్చింది. 'కిల్లింగ్ వీరప్పన్ ' అనే సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఒక బ్లాక్ బాస్టర్ అందించారు అని ఆడియ‌న్స్ నుంచి మంచి టాక్ రావ‌డంతో చాలా హ్యాపీగా ఉన్నామ‌ని అంటున్నారు నిర్మాత‌లు.

    శివ రాజ్ కుమార్, సందీప్ భ‌ర‌ద్వాజ్, య‌జ్క్షాశెట్టి, ప‌రూల్ యాద‌వ్ , రాక్ లైన్ వెంక‌టేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి నిర్మాత‌లుః బీవీ మంజునాథ్, ఇ.శివ‌ప్ర‌కాష్‌, బి ఎస్ సుధీంద్ర, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోపాల్ వ‌ర్మ‌.

    English summary
    ‘Killing Veerappan’ directed by Sensational director Ram Gopal Varma on Sri Krishna Creations, GR Pictures and Z3 Productions banners, has completed all formalities and is all set to release on January 7th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X