»   » షాకింగ్: వర్మ తయారు చేసిన వీరప్పన్ ఇతడా?

షాకింగ్: వర్మ తయారు చేసిన వీరప్పన్ ఇతడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైరాబాద్: రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో ‘వీరప్పన్' పాత్ర పోషించిన సందీప్ భరద్వాజ్ ను అచ్చం వీరప్పన్ లాగనే తీర్చి దిద్దాడు వర్మ. సినిమాలో కనిపిస్తున్నట్లు అతని అసలు రూపం అది కాదు. అదంతా మేకప్ మాయే. తాజాగా వర్మ తన ట్విట్టర్లో సందీప్ భరద్వాజ్ అసలు రూపం రిలీజ్ చేసారు. అది చూసిన వారంతా షాకవుతున్నారు. ఇతడా వర్మ తయారు చేసిన వీరప్పన్ అని ఆశ్చర్య పోతున్నారు. ఇదంతా మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ టాలెంటే అని స్పష్టం చేసారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీ అన్ని అడ్డంకులు తొలగించుకుని జనవరి 1, 2016న విడుదలయ్యేందుకు అంతా సిద్ధమైన నేపథ్యంలో మరో అడ్డంకి వచ్చి పడింది. ఈ సినిమా విడుదల నిలిపి వేయాలని మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. సినిమా మొత్తం తప్పుల తడకే, సినిమాలో అవాస్తవాలు చిత్రీకరించారు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. అయితే సినిమాను ఆపడానికి కోర్టు నిరాకరించింది. కేసునె జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

శివరాజ్ కుమార్, పరుల్ యాదవ్, యగ్నా శెట్టి, సందీప్ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించిన ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ అవుతోంది. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్‌కు ఓ పోలీస్ అధికారి ఎలా చెక్ పెట్టాడు, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేసాడు, చివరకు అతన్ని ఎలా మట్టుపెట్టాడు అనేది అసలు స్టోరీ. ఈ చిత్రంలో ఒకప్పుడు వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ సీనియర్ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

Killing Verappan Sandeep Bharadwaj real look

తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు. 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

English summary
"Terrific actor Sandeep bharadwaj's transformation as Veerappan is due to genius of make up artiste Vikram Gaikwad" RGV tweeted.
Please Wait while comments are loading...