Just In
- 1 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నక్క తోక తొక్కిన కిరాక్ ఆర్పీ.. మొత్తానికి కల నెరవేర్చుకున్నాడు.. దర్శకుడిగా మారిన కమెడియన్
జబర్దస్త్ వేదికపై మెరిసిన కమెడియన్ కిరాక్ ఆర్పీకి అదృష్టం కలిసి వచ్చింది. మొత్తానికి కిరాక్ ఆర్పీ తాకు కలలు కన్న స్వప్నాన్ని నెరవేర్చుకోబోతోన్నాడు. దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చిన కిరాక్ ఆర్పీ తన గమ్యాన్ని చేరుకున్నాడు. జేడీ చక్రవర్తి, రావు రమేష్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్స్‌ను హ్యాండిల్ చేయబోతోన్నాడు. ఈ మేరకు నేడు చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

జబర్దస్త్ వేదికగా..
కిరాక్ ఆర్పీ జబర్దస్త్ వేదికపై ఓ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. టీం లీడర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి నాగబాబుతో కలిసి అదిరింది షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా బుల్లితెరపై వెలిగిన కిరాక్ ఆర్పీ వెండితెరపైనా చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

దర్శకుడు కావాలన్నదే కల..
జబర్దస్త్, అదిరింది షోల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు, నాగబాబు అలా వదిలి వెళ్లడంపై ఆర్పీ స్పందిస్తూ.. ఎవరి కోసం ఏది ఆగదని, ఎవరు ఎక్కడున్నా తామంతా ఒక్కటేనని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వెండితెరపై దర్శకుడిగా మారడమే తన లక్ష్యమని తెలిపాడు.

జేడీ చక్రవర్తి హీరోగా..
ఇక నేడు కిర్రాక్ ఆర్పీ దర్శకుడిగా మారాడు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చేశాడు.

సస్పెన్స్ థ్రిల్లర్..
కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. జే.డి.చక్రవర్తితో పాటు, ప్రకాశ్ రాజ్, రావురమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఆర్పీ తెలిపాడు.