»   » అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావ్ రెండో చిత్రం సబ్జెక్టు ఇదే

అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావ్ రెండో చిత్రం సబ్జెక్టు ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌రావ్‌ రూపొందించిన చిత్రం 'దోభీ ఘాట్‌' విడుదల కాకుండానే క్రేజు, పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉత్సాహంలో ఆమె మరో చిత్రం డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ఆమె దృష్టి రియాల్టి షోలపై పడింది. టీవీ మీడియాలో బాగా పెరిగిపోతున్న రియాల్టీ షోల నేపథ్యాన్ని కథాంశంగా తీసుకొని సినిమా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. రియాల్టీ షోల్లో పాల్గొంటున్న వ్యక్తులు..నిర్వాహకుల మాటలు విని ఎలాంటి మానసిక స్థితికి చేరుకుంటున్నారు..ఆ తరవాత వారి పరిస్థితి ఎలా ఉంటోంది..అనే అంశాలను ఈ చిత్రంలో ఆమె ప్రస్దావించబోతోంది.

ముఖ్యంగా ఆ రియాల్టీ షోలు పూర్తయిన తరవాత సదరు వ్యక్తుల నిజమైన జీవనచిత్రం ఎలా ఉంటోందనే విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. పూర్తి స్ధాయి సహజత్వంతో కొన్ని నిజాలను ఈ చిత్రంలో ఆమె ప్రస్ధావించబోతోందని, సంచలనమై తీరుతుందని స్క్రిప్టు దశలోనే ఈ చిత్రానికి టాక్ వచ్చేసింది. అలాగే ఈ చిత్రం కథకు రాఖీ సావంత్ వివాదమే ప్రేరణ అని తెలుస్తోంది. ఇక దోభీఘాట్ చిత్రం వచ్చే నెల(జనవరి)లో విడుదల కానుంది. ముంబై నగర నేపధ్యంలో జరిగే కథగా కనిపించే ఈ చిత్రంలో అమీర్‌ ఖాన్ చిత్రకారుడిగా కనిపిస్తారు. ఇప్పటికే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు పొందింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu