»   » టీజర్ తో కుమ్మేసాడు : రాజ్ తరణ్ ఇంకో హిట్ కొట్టేడట్లు ఉన్నాడు

టీజర్ తో కుమ్మేసాడు : రాజ్ తరణ్ ఇంకో హిట్ కొట్టేడట్లు ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. వంశీ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నూతన సంవత్సరం కానుకగా విడుదలైన ఈ కొత్త టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ఈ టీజర్ లో లేడీ కమెడియన్ స్నిగ్ధ ...బిస్కట్ అంటూ వేసే కామెడీ పంచులకు రాజ్ తరుణ్ ఇచ్చే ఇబ్బందికర రియాక్షన్స్ నవ్విస్తున్నాయి.. ఆ మధ్యలో హీరోయిన్ అనూ ఎమ్మానుయేల్ ఇచ్చే క్యూట్ ఎక్సప్రెక్షన్లు కుర్రాళ్ళకు పట్టేస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మజ్ను ఫేం అను ఇమ్మాన్యుయేల్ రాజ్‌తరుణ్‌కు జోడీగా నటిస్తోంది.


ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తూంటే .. మరోసారి రాజ్ తరుణ్ ఒక హిట్టు కంటెంట్ తోనే వస్తున్నాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఇలా కుక్కలను ఎత్తుకెళ్ళిపోవడం తరహా పనులన్నీ పిల్లలకీ ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగా ఎక్కుతాయని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.


'ఉయ్యాల జంపాల'తో అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌తరుణ్‌, 'కుమారి 21 ఎఫ్‌', సినిమా చూపిస్తా మావా తదితర చిత్రాలతో యంగ్‌ హీరోల రేసులోకి వచ్చేసి, వరస హిట్స్ తన ఉనికిని బాగానే చాటుకుంటున్నాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోల లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
After delaying Raj Tarun's next “Kittu Unnadu Jagratha,” where he will be essaying the role of a dognapper. Finally the concept teaser of the film has been unveiled.As expected, the teaser looks promising. Since it’s a concept teaser, the director totally focused on taking the concept to the people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X