»   » కిట్టుగాడు.... వచ్చే డేట్ ఫిక్స్అయింది

కిట్టుగాడు.... వచ్చే డేట్ ఫిక్స్అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. వంశీ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ ఇటీవల విడుదల న్యూఇయర్ సందర్భంగా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ విడుదల తేదీ కూడా ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్‌తరుణ్‌ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించించడంతో పాటు పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.

థియేటర్లో కలుద్దాం అంటూ ట్వీట్

చిత్రం విడుదల తేదీ ప్రకటించడం ఆనందంగా ఉంది. థియేటర్లో కలుద్దాం అంటూ రాజ్ తరుణ్ ట్వీట్ చేసారు.

rn

టీజర్ బావుంది


ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో లేడీ కమెడియన్ స్నిగ్ధ ...బిస్కట్ అంటూ వేసే కామెడీ పంచులకు రాజ్ తరుణ్ ఇచ్చే ఇబ్బందికర రియాక్షన్స్ నవ్విస్తున్నాయి. మధ్యలో హీరోయిన్ అనూ ఎమ్మానుయేల్ ఇచ్చే క్యూట్ ఎక్సప్రెక్షన్లు కుర్రాళ్ళకు పడిపోతున్నారు.

 మజ్నూ తర్వాత కిట్టుగాడితో

మజ్నూ తర్వాత కిట్టుగాడితో

‘మజ్ను' చిత్రంతో పరిచయమైన నటి అను ఇమ్మాన్యుయేల్‌ ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

 సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పృథ్వీ, నాగబాబు, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేశ్‌, ప్రవీణ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

English summary
Kittu Unnadu Jagratha release date confirmed on Feb 17th. Produced by A.K.Entertainments as production no.8, the film is being directed by Vamsi Krishna of 'Dongaata' fame. Salman Khan's brother Arbaaz Khan is making a comeback in Telugu film industry with this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu