For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బాహుబలి’: దగ్గుపాటి రానాకు గాయం

  By Srikanya
  |

  హైదరాబాద్‌: స్టార్‌ డైరక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ‘బాహుబలి' షూటింగ్ పూర్తయిన తర్వాత వానిటీ రూంకు వెళ్ళే సమయంలో రానా తల రూం డోర్ కు గట్టిగా తగిలింది.

  రానా బాగా పొడవు కావడం వలన ఈ సంఘటన జరిగింది. దాంతో చిన్న గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రానా తెలియచేసారు. ‘కొన్నిసార్లు జైంట్ పర్సనాలిటీ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు' అంటూ తన హైట్ మీద ట్విట్టర్ లో జోక్ వేశాడు.

  అలాగే ఈ విషయం తెలియచేస్తూ...‘భారి యాక్షన్ సినిమాలలో నటించే సమయంలో గాయాలు(ఇంజురీ) కావడం సహజం అని నేను అనుకుంటున్నాను, ఆన్ లొకేషన్ (సెట్స్)లో అయినా కావొచ్చు, బయట అయినా కావొచ్చు' అన్నారు.

  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

  తాను తీసే ప్రతీ సినిమాతోనూ సాంకేతికంగా ఓ అడుగు ముందుకేస్తూ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కిస్తుంటారు దర్శకుడు రాజమౌళి. 'మగధీర', 'ఈగ' చిత్రాల్లో విభిన్నమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూపించి అబ్బురపరిచారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'బాహుబలి'కి కూడా కొత్త హంగులు జత చేయబోతున్నారు. దృశ్య రూపంలోనే కాకుండా శబ్దాల విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఫోలే రికార్డింగ్‌తో 'బాహుబలి'ని తీర్చిదిద్దుతున్నారు.

  Knocked my head on the vanity door: Rana

  అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫోలే కళాకారుడు ఫిలిప్‌ వ్యాన్‌ లీర్‌ 'బాహుబలి' కోసం రెండు వారాలపాటు పనిచేయనున్నారు. అందుకోసం బెల్జియం వెళ్లింది చిత్రబృందం. సినిమాలోని ప్రతీ శబ్దాన్నీ మరింత ప్రస్ఫుటంగా వినిపిస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేదే ఫోలే రికార్డింగ్‌. అడుగుల చప్పుడు, దుస్తుల కదలికలు మొదలుకొని మనం పట్టించుకోని చిన్న చిన్న శబ్దాల్ని సైతం ఫొలో రికార్డింగ్‌ ద్వారా సృష్టించి చిత్రంలో వినిపించొచ్చు.

  సౌండ్‌ ఇంజినీర్‌ సతీష్‌ ఆధ్వర్యంలో ఫోలే రికార్డింగ్‌ పనులు జరగబోతున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'బాహుబలి' చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఇందులో అనుష్క, తమన్నా కథానాయికలు. రానా ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  అలాగే...లైవ్‌ యాక్షన్‌ సినిమా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్‌ యాక్షన్‌ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్‌ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.

  ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్‌ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్‌ తయారు చేసే పనిలో ఉందట.

  ఓ చిప్‌లో మొత్తం ఎఫెక్ట్స్‌ను అప్‌లోడ్‌ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్‌ మీద ఏమైతే విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మిక్స్‌ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు.

  English summary
  Rana Daggubati tweeted: "While doing these big action films I guess injuries are a must whether it's on set or off. Knocked my head on the vanity door!!Damm....Smtimes being all giant like doesn't help."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X