Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రూ. 233.64 కోట్ల అంచనా..... సంపూర్ణేష్ బాబు సంచలనం!
Recommended Video
'బిగ్ బాస్' తెలుగు ఫస్ట్ సీజన్ పూర్తయిన తర్వాత సంపూర్ణేష్ బాబు సందడి తగ్గింది. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగు తెరపై కనిపించక పోవడం, ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో ఉండే ఆయన కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోవడమే అందుకు కారణం. ఈ రోజు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్ర బృందం బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు. సమ్మర్ రిలీజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని అందులో పేర్కొనబడి ఉంది. అంతే కాదు.... ఈ సారి మా సినిమా తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అంటూ ప్రకటించుకోవడం గమనార్హం.
ఫస్ట్ వీక్ గ్రాస్ రూ. 233.64 కోట్ల అంచనా
‘కొమరిమట్ట' సినిమా రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాస్తుంది. తొలివారం మా చిత్రం రూ. 233.64 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నాం అంటూ ప్రమోషన్ పోస్టర్ విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది.
థాంక్స్ చెప్పిన సంపూ
తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ డిజైన్ చేసి విడుదల చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ...... చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు.
మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమా గురించి గతంలో సంపూ మాట్లాడుతూ.... ‘కొబ్బరి మట్ట' ఒక కుటుంబ కథా చిత్రం... నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక పిల్లలు అంటే మన ఇష్టంతో కలుపుకునే కుడితి.... కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. గొప్ప సెంటిమెంట్ ఈ సినిమా రాబోతోంది అని వ్యాఖ్యానించారు.
తెర వెనక
ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.