»   » ప్రియాంక చోప్రాను చంపాలనుకున్న బాలీవుడ్ స్టార్ హీరో!

ప్రియాంక చోప్రాను చంపాలనుకున్న బాలీవుడ్ స్టార్ హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' అనే టీవీ చాటింగ్ షో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులను ఆహ్వానించి వారిని నుండి సంచలన విషయాలు, వారి గురించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని రహస్యాలు రాబట్టడం ఈ షో ప్రత్యేకత.

తాజాగా ఈ షోలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్‌పుత్ తో కలిసి పాల్గొన్నారు. కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు ఇద్దరూ చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. తమ పర్శనల్ లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలు షేర్ చేసుకున్నారు.

Koffee With Karan: Shahid - Mira couple answered in a bold manner

ఈ షోలో 'కిల్-మారీ-హుక్ అప్' అనే గేమ్ కూడా ఓభాగం. అంటే మీకు చంపే అవకాశం ఇస్తే ఎవరిని చంపుతారు, పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరని చేసుకుంటారు, హుక్ అప్ (ఎఫైర్) అవకాశం వస్తే ఎవరితో అనే ప్రశ్నకుల ముగ్గురు హీరోయిన్ల పేరు చెప్పాల్సి వస్తుంది.

ఈ ప్రశ్నకుల షాహిద్ కపూర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు చంపే అవకాశం వస్తే ప్రియాంక చోప్రాను చంపుతానని, పెళ్లి చేసుకునే అవకాశం వస్తే సోనాక్షి సిన్హా, హుక్ అప్ అవకాశం వస్తే బ్యూటీఫుల్ అలియా భట్ తో అంటూ సమాధానం ఇచ్చారు.

ప్రియాంక చోప్రా అతనితో నటించేందుకు నిరాకరించింది కాబోలు...అందుకే ఆమోను చంపి రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు అంటూ నెటిజన్లు షాహిద్ మీద సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

English summary
Shahid Kapoor and his wife Mira Rajput attended as guests for the latest episode of KWK recently. Shahid - Mira couple answered Karan's questions in a bold manner. Kill - Marry - Hook up game is part of this KWK show, where Karan will question the guests that whom they will kill, whom they will marry and whom they will hook up giving the names of three heroines.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu