»   »  కొలవెరి..డి' కిక్కు 10 కోట్లు దాటింది

కొలవెరి..డి' కిక్కు 10 కోట్లు దాటింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'వై దిస్‌ కొలవెరి..' అంటూ వెర్రిగా సాగే ఈపాట కుర్రకారును ఉర్రూతలూగించింది. ధనుష్‌ ఈ పాటని పాడి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసారు, అంతే ప్రతి ఒక్కరికి కొల వెర్రి పట్టుకుంది. ఎంతో అద్బుతంగా రూపొందించిన ఈ పాటకి స్పందన బాగా కలసివచ్చింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా ఈపాటను చూసారు. ఎన్నో పేరడీలు ఈ పాట చుట్టు అంల్లుకున్నాయి.

శ్రుతిహాసన్‌, ధనుష్‌ జంటగా నటించిన 'త్రి' చిత్రం కోసం ఈ 'కొలవెరి' పాటను ఆయన ఆలపించారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ పాటకి సంగీతం అందించారు. ధనుష్‌ సతీమణి ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'Kolaveri Di' surpasses 100 million views on Youtube

ఇక ఈ పాట ధనుష్, శృతిహాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న త్రి చిత్రంలోది. ఈ పాట నేపధ్యంలోకి వస్తే...ఓ సాదాసీదా అబ్బాయి. ప్రేమలో పడ్డాడు. కొన్ని కారణాలవల్ల ప్రేమలో ఓడిపోయాడు. బాధలో ఒక పాట పాడతాడు. ఇక 'వై దిస్‌ కొలావరి డి' అంటే అర్ధం 'చంపెయ్యాలన్నంత కసి ఎందుకే!' అని.

'యో బోయిస్‌ అయామ్‌ సింగింగ్‌ ఎ సాంగ్‌. సూప్‌ సాంగ్‌..ఫ్లాప్‌ సాంగ్‌. వై దిస్‌ కొలావరి డి...... వైట్‌ స్కిన్ను గరలు. గరలు హార్టు బ్లాకు... ఐసు ఐసు మీటు.. మై ఫ్యూచర్‌ డార్కు... వై దిస్‌ కొలావరి డి...''. అలా సాగిపోతుందీ పాట. ఆ ఫ్లాప్‌ సాంగే ఇవాళ ఖండాలను దాటుకుని కుర్రకారునేగాక, అమితాబ్‌ వంటి సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంది. యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్కుల్లో కోలాహలం సృష్టిస్తోంది.

English summary
Dhanush's song 'Kolaveri di' became a sleeper blockbuster in 2011 and it continues to have its victorious run in the virtual world. The song has surpassed 100 million views on Youtube since its release.
Please Wait while comments are loading...