»   » ‘బ్రూస్ లీ' : రైటర్ కోన వెంకట్ ఖండన

‘బ్రూస్ లీ' : రైటర్ కోన వెంకట్ ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమ చిత్రంపై వస్తున్న రూమర్స్ ని రచయిత కోన వెంకట్ ఖండించారు. అంతేకాకుండా తమ చిత్రం బ్రూస్ లీ మంచి విజయం సాధించిందని, బాగా రన్ అవుతోందని, మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. అలాగే రూమర్స్ ని నమ్మవద్దని అన్నారు. ఆయన చేసిన ట్వీట్ చూడండి.


ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రం గురించి రికవరీలు చేయమని అడుడుగునత్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నారు. ఈ విషయమై వెంటనే కోన వెంకట్ స్పందించారు.


అలాగే...ఉదయం నుంచీ వస్తున్న రూమర్స్...


శ్రీను వైట్ల మీద కోన వెంకట్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావే వేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ‘బ్రూస్ లీ' సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన నేపథ్యంలో తనకు తప్పుడు క్రెడిట్ అపాదించే ప్రయత్నం చేస్తున్నారని కోన వెంకట్ వాదిస్తున్నట్లు సమాచారం.


Kona Venkat quashes all rumours

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బ్రూస్ లీ సినిమా కోసం తాను అందించిన స్టోరీలో తన ప్రమేయం లేకుండా అనేక మార్పులు చేసారని, ఇపుడు సినిమా ప్లాపు కావడంతో తన స్టోరీ వల్లే సినిమా ప్లాప్ అయిందనే ప్రచారం చేస్తున్నారని కోన వెంకట్ ఆగ్రహంగా ఉన్నట్లు టాక్. తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీ వాడకుండా, మార్పులు చేర్పులు చేసి ఇపుడు ఆ స్టోరీ తనదే తన పేరు బదనాం చేస్తున్నారని కోన వెంకట్ వాదిస్తున్నాడట.


రైటర్ గా తన పేరు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న శ్రీను వైట్ల నుండి పబ్లిక్ గా అపాలజీ కోరుతూ రూ. 10 కోట్ల డిఫామేషన్ సూట్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీని ఆన్ లైన్లో పెట్టేందుకు కూడా కోన వెంకట్ ట్రై చేస్తున్నారని, అప్పుడే మెగా అభిమానులకు, ప్రేక్షకులు నిజా నిజాలు తెలస్తాయని కోన వెంకట్ భావిస్తున్నారట.


మరో వైపు ‘బ్రూస్ లీ' చిత్ర నిర్మాత డివివి దానయ్య కూడా రైటర్ కోన వెంకట్ కు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెలుతుందో? హాట్ టాపిక్ అయింది. ఈ గొడవ పెద్దది కాకుండా రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నాడని, అవసరం అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.


English summary
"Pl don't believe any rumours or gossips regarding our movie "Bruclee".It's still running with good collections..Still getting good response", said Kona Venkat, through his tweets", said Kona Venkat, through his micro-blogging site.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu