twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోన వెంకట్ అబ్జక్షన్ లేదన్నాకే సెన్సార్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సెన్సార్ చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటుంది. బయిట పాపులర్ అయిన వారి పేరుని సినిమాల్లో వాడితే వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటుంది. రిలీజయ్యాక వచ్చే తల నొప్పులు లేకుండా ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. రీసెంట్ గా అలాంటి సమస్యే అల్లరి నరేష్ చిత్రానికి ఎదురయ్యింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టైటిల్ తో విడుదల అవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం పేరుని కోన వెంకట్ అని పెట్టారు. దాంతో వెంటనే నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ని కోన నుంచి తెచ్చుకోమని సెన్సార్ వారు చెప్పటం జరిగింది. ఇమ్మిడియట్ గా కోన వెంకట్ ఆ సినిమా చూసి, ఆ టీమ్ కు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం.

    చిత్రం విషయానికి వస్తే..

    నరేష్‌, మోనాల్‌ గజ్జర్‌, కర్తినా ముఖ్యపాత్రల్లో బి. చిన్ని దర్శకత్వంలో ఈవివి. సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కాసుమిల్లి నిర్మిస్తున్న చిత్రం 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి' . ఈ చిత్రం ఈ నెల 7న విడుదల అవుతోంది. చిత్రాన్ని ఓవర్ సీస్ లో సైతం భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    Kona Venkat's NOC To Brother Of Bommali

    నరేష్‌ మాట్లాడుతూ.. సాధారణంగా చెల్లె సెంటిమెంట్‌ అంటే నీ పాద మీద పుట్టుమచ్చనై.. చెల్లెమ్మా.. అనే ఫీలింగ్‌ వుంది. కానీ ఈ సినిమాలో అన్న బెండు తీసే చెల్లెల్ని చూస్తారు. అలాంటి సెంటిమెంట్‌ సినిమాలకు పూర్తి భిన్నంగా చిన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినందుకు కార్తిక దన్యవాదాలు అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ... బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ చిత్రంలో నరేష్ చెల్లెలి పాత్ర కోసం ఎవరిని ఎంపికచేయాలని ఆలోచిస్తున్న సమయంలో కార్తీక పేరును నరేష్ సూచించారు. ఆమె మాత్రమే ఈ పాత్ర చేయగలదని ఆయన చెప్పారు. మేము అనుకున్న దానికంటే కార్తీక తన పాత్రకు వందరెట్లు న్యాయం చేసింది. గయ్యాళి చెల్లెలిగా నరేష్‌తో పోటీపడి నటించింది అన్నారు చిత్ర దర్శకుడు బి.చిన్ని.

    దర్శకుడు మరిన్ని విశేషాలు తెలియజేస్తూ ఇంతవరకు నరేష్ సినిమాల్లో ఆయన మాత్రమే కామెడీ చేసేవారు. కానీ ఈ సినిమాలో కార్తీక కూడా కడుపుబ్బా నవ్విస్తుంది. డూప్ లేకుండా ఆమె చేసిన ఫైట్స్ హైలైట్‌గా వుంటాయి. అల్లరి, చిలిపితనం కలబోసిన ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య సెంటిమెంట్ సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా వుంటాయి అన్నారు.

    English summary
    Censor officials asked Bommali team to get NOC (No Object Certificate) from writer Kona Venkat as they have used his name for one of the main characters in the film. Bmmali team have contacted Kona Venkat and the writer immediately gave them NOC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X