Don't Miss!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కోనా కోపం ఇంకా తగ్గలేదు: మళ్ళీ అతని మీద విరుచుకు పడ్డాడు
కమేడియన్ ఆఫ్ బాలీవుడ్ "కమాల్ ఆర్ ఖాన్" మీద తన అసహనాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టాడు కోనా వెంకట్. ఎప్పుడు చూసినా దక్షిణాది హీరోలమీదా, మన సినిమాలమీదా పడి ఏడ్చే కమాల్ ఖాన్ అంటే టాలీవుడ్ లో ఎవరికీ పడదు. ఆమాట నిర్మొహమాటంగా ఎవ్వరూ అనలేకపోయారు కానీ కోనా వెంకట్ మాత్రం అంత సైలెంట్ గా ఉండలేకపోయాడు... రచయితగా చాలా సినిమాలకు పని చేసి దర్శకుడిగా మారిన బీవీఎస్ రవి కమాల్ ఆర్ ఖాన్ కి గౌరవంగా రిప్లై ఇవ్వటాన్ని కూడా కోనా ఒప్పుకోలేదు... ఇంతకీ ఏం జరిగిందీ అంటే...

థ్యాంక్ యు సర్ అంటూ ట్వీట్
రవి దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్' పాటలకు సంబంధించిన లింక్‌ను కమల్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ఇందుకు రవి థ్యాంక్ యు సర్ అంటూ ట్వీట్ పెట్టాడు. దీంతో కోనకు కోపం వచ్చింది. ఇలాంటి వాళ్లను కూడా గుర్తించడం బాధాకరం అంటూ అసహనంతో ట్వీట్ చేశాడు కోన. ఆయన కోపానికి కారణం లేకపోలేదు.
Recommended Video


పవన్‌ను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూసుకుని తనకు తాను గొప్ప క్రిటిక్‌గా ఫీలైపోయే కమల్.. పబ్లిసిటీ కోసం సెలబ్రెటీల మీద అవాకులు చెవాకులు పేలుతుంటాడు. ఆ మధ్య మన సౌత్ స్టార్లను కూడా అతను టార్గెట్ చేశాడు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్' హిందీలో రిలీజైన సమయంలో కమల్ పవన్‌ను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.

టెర్రరిస్టుల కన్నా వరస్ట్
కొన్నాళ్ళ కిందట కమల్ ప్రభాస్, రానాల గురించి కూడా పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్లో వాళ్లిద్దరి కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ అని వ్యాఖ్యానిస్తూ.. వాళ్ల గురించి చెత్త వ్యాఖ్యానాలు చేశాడు. దీని మీద స్టార్ రైటర్ కోన వెంకట్ స్పందించాడు. కమల్ లాంటి వాళ్లు టెర్రరిస్టుల కన్నా వరస్ట్ అని.. అతడి స్టుపిడిటీని రాజమౌళి.. ప్రభాస్.. రానా మన్నించాలని అన్నాడు. అప్పట్లో చిన్న పాటి వివాదం రేగి ఆగిపోయింది.

మోహన్ లాల్
అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి కూడా అలాగే చీప్ కామెంట్లు చేశాడు. ఇలా స్టార్లను టార్గెట్ చేయడం ద్వారా వివాదాలు రాజేసి.. దాని ద్వారా వచ్చే పబ్లిసిటీతో పాపులర్ కావాలని చూసే చీప్ మెంటాలిటీ అతడిది. బాలీవుడ్ వాళ్లు ఆల్రెడీ అతణ్ని పట్టించుకోడం మానేశారు.

కోనకు కోపం తెప్పించింది
ఇలాంటి సమయంలో రవి కమల్ పెద్ద క్రిటిక్ అన్నట్లుగా అతను తన సినిమా పాట లింక్ షేర్ చేయగానే థ్యాంక్స్ చెప్పడం కోనకు కోపం తెప్పించింది. మనోడికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కావడం కూడా ఇలా రెస్పాండవడానికి కారణం అయ్యుండచ్చు కూడా.