»   » కోన వెంకట్ తో మాట్లాడాలా? ..ఇదిగో వీడియో ఛాట్

కోన వెంకట్ తో మాట్లాడాలా? ..ఇదిగో వీడియో ఛాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ రచయిత కోన వెంకట్ తాజా చిత్రం శంకరాభరణం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సంభందించి ఆయన సినీ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆయన వీడియో ఛాట్ చేయనున్నారు. ప్రశ్నలు...ఆయన ఫేస్ బుక్ కామెంట్ భాక్స్ లో పంపితే ఆయన వీడియో ద్వారా సమాధానమిస్తారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం ...ప్రశ్నలు అడగండి.

Happy to announce my First Ever Video Chat.. Send in your questions in the comment box below and I shall answer them through a video..Keep them interesting guys

Posted by Kona Venkat on 6 December 2015

ఇక మొన్న శుక్రవారం శంకరాభరణం రిలీజైంది. నిఖిల్ స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి చేసిన సినిమా ‘శంకరాభరణం'. ఉదయ నందనవనం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటిస్తే, అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించింది.

కోన వెంకట్ మాట్లాడుతూ ‘నా కెరీర్ గ్రాఫ్ ని మార్చేసి నాకు స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఢీ'. ఆ సినిమా వచ్చిన10ఏళ్ళ తర్వాత మళ్ళీ నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ‘శంకరాభరణం'. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ మూవీ ప్రవాహంలో కొట్టుకుపోయి, ఏ మాత్రం గ్యాప్ లేకుండా పనిచేయడం వలన మనకు తెలియకుండానే మన నుంచి రెగ్యులర్ సినిమాలు వచ్చేస్తుంటాయి. ఆ చట్రం నుంచి బయటకి వచ్చి నన్ను నేను చెక్ చేసుకొని కొత్తగా ఏదన్నా చేయాలి అని చేసిన సినిమా శంకరాభరణం.

Kona Venkat Vedio Chat Details

అందుకే రైటర్, డైరెక్టర్, హీరో అనే వారు ఎన్ని సెంటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది, ఎంత కలెక్ట్ చేసింది అనే చట్రంలోకి వెళ్ళకూడదు. అదొక మాయ లాంటిది దానివలన మనం కరెక్ట్ సినిమాలు ఎంచుకోము. ఇవన్నీ ఆలోచించి డిఫరెంట్ గా చేసిన సినిమానే శంకరాభరణం. నేను కథ నుకున్న తర్వాత నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాయస్ నిఖిల్, అలాగే టీం మొత్తం సూపర్బ్ గా కుదిరింది. ఈ సినిమా ద్వారా చాలా మంది అబ్రాడ్ టెక్నీషియన్స్ ని పరిచయం చేసాను. అందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారని' అన్నాడు

మరో ప్రక్క గీతాంజలి, శంకరాభరణం వంటి క్లాసిక్స్‌గా నిలిచిపోయిన చిత్రాల టైటిల్స్‌ని మళ్లీ తెరపైకి తెస్తూ థ్రిల్లర్, క్రైమ్ కామెడీల పేరుతో కోన వెంకట్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శంకరాభరణం అంటూ ఓ క్రైమ్ కామెడీ చిత్రాన్ని అందించిన ఆయన పాతాళభైరవి పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది. అయితే ఇలా క్లాసిక్స్ చిత్రాల టైటిల్స్ ని వాడుకోవటం పద్దతి కాదని చాలా విమర్శలు వస్తున్నాయి.

English summary
Kona Venkat shared in FB: Happy to announce my First Ever Video Chat.. Send in your questions in the comment box below and I shall answer them through a video..Keep them interesting guys"
Please Wait while comments are loading...