For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేతిలో థియేటర్స్ ఉన్నవాళ్ళే..: హాస్య నటుడు కొండవలస

  By Srikanya
  |

  బాపట్ల: చేతిలో 1200 సినిమా హాళ్లు ఉన్న నిర్మాతలే రూ.50 కోట్లు, రూ.60 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయగలుగుతున్నారని ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అన్నారు. విశాఖపట్టణం ప్రత్యేక యాసలో 'ఐతే ఓకే' డైలాగుతో వంశీ ఔనూ వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈలపాటి రఘురామయ్య సంస్మరణ సభలో పాల్గొనేందుకు గుుంటూరూ జిల్లా బాపట్ల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  చిన్న చేపలను పెద్ద చేపలు మింగినట్లే చిన్న సినిమాలను పెద్దవి మింగేస్తున్నాయని కొండవలస లక్ష్మణరావు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కొత్తదనం పేరుతో తీసే సినిమాల్లో తెలుగుదనం, సంస్కృతి కరువయ్యాయన్నారు. వాటిలో ఇతర భాషల నటులు, సాంకేతిక నిపుణులకే ఎక్కువ అవకాశాలను ఇస్తూ స్థానికులైన తెలుగువారికి అవకాశాలివ్వడం లేదన్నారు.

  తమిళంలో మాత్రం నేటివిటీ, సంస్కృతిని మరిచిపోకుండా అక్కడి దర్శకులు సినిమాలు రూపొందిస్తూ విజయాలు సాధిస్తున్నారు. మన సినిమాల్లో అవకాశాలు వచ్చినా యువకులకే నంటూ పెద్ద నటులకు అవకాశం ఇవ్వటం లేదని వివరించారు. ఎక్కువ చిన్న సినిమాలు తీస్తే చాలా మంది నటులకు అవకాశాలు లభిస్తాయని, యువ నటుల్లో అద్భుత నటులు ఉన్నా వారు బుల్లితెర వైపే పరుగెడుతున్నారన్నారు. రంగస్థలానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదని, నటులు తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకోకుండానే సినిమాల్లోకి వచ్చి కొద్ది కాలానికే తెరమరుగు అవుతున్నారన్నారు. ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావు లాంటి నటులు తిరిగి రావటం అసాధ్యమేనని, ఎన్టీఆర్‌లా నవరసాలు పలికించే, అందమైన నటుడిని మరొకరిని చూడలేమన్నారు.

  తన కెరీర్ గురించి చెప్తూ...నాటక రంగంలో 16 ఏట ప్రవేశిం చాను. రెండు వేలకుపైగా నాటాకాలు వేస్తే విలన్ పాత్రలకు రెండుసార్లు నం ది అవార్డు వచ్చింది. ఎన్నో కష్టాలు పడి 56వ ఏట 'ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు' సినిమాతో వెండితెరపైకి వచ్చిన నేను ఇప్పటికి 248 సినిమాల్లో నటించా ను.

  నాటక రంగంలో రెండు నంది అవార్డులు తెచ్చుకున్నప్పటికి సినీ రంగంలో ఆ మేరకు పాత్రలు రావటం లేదు. రెండువేలకుపైగా నాటకాలు వేశాను. అల్లదుగో.. ఊరు అనే నాటకాన్ని ద్రాక్షారామంలో వేశాం. అప్పటివరకు నాది విలన్ పాత్ర. ఆ రోజు హాస్యపాత్ర ధరించే నటుడు రాకపోవడంతో.. ఆ హాస్యపాత్ర నేను వేయాల్సి వచ్చింది. ఆ నాటకాన్ని చూసేందుకు వచ్చిన దర్శకుడు కృష్ణవంశీతోపాటు పలువు నాతో హాస్యపాత్రలు చేయించాలని నిర్ణయించుకున్నారు.

  నాకు తెలియని వైజాగ్ యాస నేడు నాకు జీవితాన్నిచ్చింది. మాది శ్రీకాకు ళం జిల్లా ఆముదాలవలస స్టేషన్ సమీపంలోని కొండవలస గ్రామం. వైజాగ్ పోర్టులో అకౌంటెంట్ సూపరింటెండెంట్‌గా పదవీవిరమణ చేశాను. చిన్న, హాస్య కళాకారులకు ఈ పోటీ ప్రపంచంలో సరైన పాత్ర లు లభించించటంలేదు. గతంలో కథలు పాత్రలకు అనుగుణం గా ఉండేవి. ఇప్పుడు దర్శకుడి ఇష్టంపై కథ, పాత్రలు ఉండటం బాధాకరం. మా అబ్బాయి మణిధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు..' అంటూ ముగించారు.

  English summary
  Popular Telugu Drama and Cine Actor,Comedian Kondavalasa Lakshman Rao became very popular with the dialogues “Nenoppukonu” and “Ithe O.K”. in the film. He has also done diploma in Acting and Direction. He has settled as a comedian with impressive action in Kabadi-Kabadi, Coolie, Nijam, Donga Ramudu & Party, Pelamtho Panenti, Sriramachandrulu, Evadigolavadidhi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X