»   » బాలయ్య, మహేష్ కాంబో చిత్రంపై కొరటాల స్పందన

బాలయ్య, మహేష్ కాంబో చిత్రంపై కొరటాల స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా మీడియాలో ఓ వార్త స్ర్పెడ్ అవుతోంది. అది కొరటాల శివ దర్సకత్వంలో బాలయ్య, మహేష్ మల్టిస్టారర్ రాబోతోందని. ఈ కాంబినేషన్ విన్న వారంతా షాక్ అవుతున్నారు. బాలయ్య, మహేష్ కాంబినేషన్ వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంటున్నారు. ఈ విషమయై సోషల్ మీడియాలోనూ చర్చలు జరగటం, మీడియాలో వార్తలు రావటం కొరటాల శివ గమనించినట్లున్నారు. వెంటనే ఆయన ఈ క్రింద విధంగా స్పందించారు.

తన తదుపరి చిత్రంలో ఓ విధమైన ఫ్యాన్సీ కాంబినేషన్ లు కానీ ,మల్టిస్టారర్ కాని లేదన్నట్లు తెలియచేసారు. దయచేసి ఇలాంటి స్పెక్యులేషన్స్ ని కట్టిపెట్టండని ఆయన సూచించారు.

Koralata

ఇదిలా ఉంటే...దూకుడు చిత్రంలో ఎమ్మెల్యేగా కనిపించి ఆకట్టుకున్న మహేష్ తదుపరి చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారని తాజా సమాచారం. సామాజిక సమస్యకు కమర్షియల్ హంగుల్ని మిళితం చేసి తనదైన శైలిలో సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ త్వరలో మహేష్‌తో రూపొందించబోయే తాజా చిత్రాన్ని కూడా ఓ పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ కథతో సెట్స్‌పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని, ఆయన పాత్ర శక్తివంతంగా వుంటుందని చిత్ర వర్గాల సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు పన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.

English summary
News has been spread in film circles saying star director Koratala Siva's next project with superstar Mahesh Babu will be a multistarrer. Balayya's name was strongly heard in this case. With this news going viral, Koratala Siva has finally responded and quashed the news.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu