»   »  మహేష్ పవర్ఫుల్ నాన్న గా ఆయన కన్ఫామ్, పక్కా న్యూస్

మహేష్ పవర్ఫుల్ నాన్న గా ఆయన కన్ఫామ్, పక్కా న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అను నేను' సినిమా షూటింగ్, కొన్ని రోజుల క్రితమే మొదలైంది. ప్రస్తుతం 'స్పైడర్' సినిమా చేస్తోన్న మహేశ్ .. మరికొన్ని రోజుల్లో అది పూర్తి చేసి, కొరటాల సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు.

భరత్ అను నేను

భరత్ అను నేను

శ్రీమంతుడు తర్వాత మహేష్‌బాబుతో కొరటాల చేస్తున్న న్యూప్రాజెక్ట్ 'భరత్ అను నేను' రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈనెల నుండి షూటింగ్‌లో ప్రిన్స్ జాయిన్ కాబోతున్నాడు. ఈసారి ప్రిన్స్ పక్కన బాలీవుడ్ బ్యూటీ కైరాఅద్వానీ హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పవర్ఫుల్ గా వుంటుందట

పవర్ఫుల్ గా వుంటుందట

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపిస్తాడనే ప్రచారమైతే సాగుతోంది. హీరోకి తండ్రిగా ఇంపార్టెంట్ రోల్‌లో ఓ సీనియర్ హీరో కనిపించబోతున్నాడన్న వార్తా కొన్నాళ్ళుగా ప్రచారం లో ఉంది. ఈ సినిమాలో మహేశ్ తండ్రి పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట.

శరత్ కుమార్ నే ఖరారు

శరత్ కుమార్ నే ఖరారు

ఈ పాత్ర కోసం తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయననే ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఆ మధ్య 'బన్నీ' సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా శరత్ కుమార్ చేసిన పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

మంచి అంచనాలు ఉన్నాయి

మంచి అంచనాలు ఉన్నాయి

ఈ సినిమాలోని పాత్ర కూడా ఆ స్థాయిలోనే వుంటుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా కైరా అద్వాని అలరించనుంది. మహేష్ బాబు, కొరటాల సేవల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘శ్రీమంతుడు' చిత్రం మహేష్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే వీరి కలయికలో రూపొందనున్న మరో సినిమాపై ప్రేక్షకుల్లో, పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి.

మహేష్‌బాబు సీఎం

మహేష్‌బాబు సీఎం

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సీఎంగా కనిపిస్తాడనే ప్రచారమైతే సాగుతోంది. హీరోకి తండ్రిగా ఇంపార్టెంట్ రోల్‌లో శరత్ కుమార్‌ కనిపించబోతున్నాడట. 60 ప్లస్‌లో పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో వుండే శరత్ కుమార్‌ని ఈ రోల్ కోసం ఫైనల్ చేసాడట కొరటాల. ఇంతకుముందు 'బన్నీ'లో అల్లు అర్జున్ తండ్రిగా శరత్ కుమార్ ఓ పవర్‌ఫుల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Tamil veteran actor Sarath Kumar has been roped in for a crucial role in Bharat anu Nenu and he will be seen as Mahesh’s father in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu