»   » ఎన్టీఆర్ మూవీకి రాత్రుళ్లు కూడా కష్టపడాల్సి వస్తోంది: కొరటాల

ఎన్టీఆర్ మూవీకి రాత్రుళ్లు కూడా కష్టపడాల్సి వస్తోంది: కొరటాల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్' అనేది వర్కింగ్ టైటిల్. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ‘జనతా గ్యారేజ్' మూవీకి స్క్రిప్టు పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో ఉన్నాడు కొరటాల.

తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' మూవీ ఆడియో వేడుకకు హాజరైన కొరటాల శివ ఆసక్తికరంగా మాట్లాడారు. మా అన్నయ్య తారక్.. మా ఫ్రెండు సుకుమార్.. మా దేవిశ్రీ ప్రసాద్.. మా ప్రసాద్.. ఇంతమంది మావాళ్లు కలిసి చేస్తున్న సినిమా ఇది. అందుకే ఇది నా సొంత సినిమాలాగా భావిస్తున్నా అన్నారు.

ఎన్టీఆర్ సినిమా కోసం నేను మామూలుగానే స్క్రిప్టు రాసుకుంటున్నాను. కానీ ‘నాన్నకు ప్రేమతో' గురించి తెలిశాక మాత్రం మరింత జాగ్రత్త రాస్తున్నాను అన్నారు. ఎన్టీఆర్ సినిమా అంటేనే నాకు స్పెషల్. తన సినిమా అనగానే ఏం రాయాలి.. ఎంత బాగా రాయాలి.. అని ఆలోచించా. ఐతే ఇన్నాళ్లూ పగటి పూటే రాసుకునేవాడిని.. కానీ నాన్నకు ప్రేమతో గురించి తెలిశాక మాత్రం రాత్రుళ్లు కూడా రాసుకుంటున్నా. రాత్రింబవళ్లు రాసుకోవాల్సి వస్తోంది. సంక్రాంతి పండక్కి నా సొంత సినిమా కంటే ఎక్కువగా ‘నాన్నకు ప్రేమతో' కోసం ఎదురు చూస్తున్నా అన్నారు.

Koratala Shiva speech about NTR's Nannaku Prematho

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ తో ఇప్పటికే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడు మరొక స్టార్ అట్రాక్షన్ తోడయ్యింది. సుప్రసిద్ధ మలయాళ నటుడు, నేషనల్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ మోహన్ లాల్ గారు ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పోటాపోటీ గా సాగే ఈ క్యారెక్టర్ గురించి వినగానే మోహన్ లాల్ గారు చాలా ఎక్సైట్ అయ్యి వెంటనే ఒకే చేసారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి - తిరు . ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావు . ఆర్ట్ - ఎ. ఎస్. ప్రకాష్. సంగీతం - దేవీ శ్రీ ప్రసాద్ నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - కొరటాల శివ. ఎగ్జిక్యూటివ్ నిర్మాత- చంద్రశేఖర్ రావిపాటి, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.

English summary
Tollywood director Koratala Shiva speech about NTR's Nannaku Prematho movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu