»   » ఈ మురికిని దేవుడు కూడా బాగుచేయలేడు: కలకలం రేపుతున్న కొరటాల శివ వ్యాఖ్యలు

ఈ మురికిని దేవుడు కూడా బాగుచేయలేడు: కలకలం రేపుతున్న కొరటాల శివ వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడూ సైలెంట్ గా ఉండే సినీ దర్శకుడు కొరటాల శివ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న డ్రగ్స్ వ్యవహారం గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యక్యలకంటే ఇప్పుదు మళ్ళీ ఒకసారి కొరటాల కలకలం టాలీవుడ్ దృష్టిని ఆకర్శించింది.

మహేష్ బాబుతో సినిమా

మహేష్ బాబుతో సినిమా

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో సూపర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కొరటాల.. రాజకీయ నేపథ్యంలో మహేష్ బాబుతో సినిమా చేయడం అంచనాలను పెంచేసింది. ఇటీవల టాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌పై కొరటాల స్పందించారు. సమాజంలో డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైన అవినీతి, అక్రమాలపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేకంగా సిట్ బృందాలని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిస్తే చాలా బాగుంటుందని ట్వీట్ చేశారు.

మహేష్ బాబును సీఎంగా చూపి

మహేష్ బాబును సీఎంగా చూపి

అనినీతిపరులపై సిట్ దర్యాప్తు అంటూ కొరటాల చేసిన ప్రతిపాదనకు ఆన్‌లైన్‌లో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయాలపై కొరటాల చేసిన ట్వీటును బట్టి చూస్తే.. మహేష్ బాబును సీఎంగా చూపి.. ఏకంగా ఆయన్నే రాజకీయాల్లో తెచ్చేందుకు ప్లానేదైనా చేస్తున్నారా.. అంటూ చర్చ సాగుతోంది.

రాజకీయాలని టార్గెట్ గా

రాజకీయాలని టార్గెట్ గా

అందుకే కుళ్లు రాజకీయాలను మహేష్ బాబు దారిలోకి తెస్తాడా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రస్తుత రాజకీయాలని టార్గెట్ గా మళ్ళీ ఒక వ్యాఖ్య ని విసిరాడు. రోజురోజుకూ రాజకీయాలు మురికిమయంగా మారిపోయాయని శివ కామెంట్ చేశాడు. ఎన్నడూ లేనంత దారుణమైన స్థాయికి ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయని అన్నాడు.

Ram Charan offers Huge Remuneration For Koratala Shiva
దేవుడు కూడా కాపాడలేడు

దేవుడు కూడా కాపాడలేడు

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను దేవుడు కూడా కాపాడలేడని తెలిపాడు. ఎవరికి వారు ప్రయత్నిస్తే తప్ప రాజకీయాలు బాగుపడవని అభిప్రాయపడ్డారు. కొరటాల వ్యాఖ్యల పట్ల చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.కొరటాల వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మద్దతిస్తున్నారు

మద్దతిస్తున్నారు

ఆయన కామెంట్లకు చాలామంది మద్దతిస్తున్నారు. మరికొందరేమో కొరటాల తదుపరి సినిమాలో రాజకీయాల గురించి ఆసక్తికర అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కొరటాల శివ ‘భరత్ అనే నేను' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్‌బాబు ‘ముఖ్యమంత్రి'గా

మహేష్‌బాబు ‘ముఖ్యమంత్రి'గా

ఈ సినిమాలో మహేష్‌బాబు ‘ముఖ్యమంత్రి'గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొరటాల ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా రాజకీయాల గురించి కొరటాల వ్యాఖ్యలు అక్షర సత్యమని నమ్మక తప్పదు.

రాజకీయ నేపథ్యం కలిగిన కథతో

రాజకీయ నేపథ్యం కలిగిన కథతో

అయితే, రాజకీయ నేపథ్యం కలిగిన కథతో సినిమాను డైరెక్ట్ చేస్తోన్న కొరటాల ఉన్నట్టుండి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించడం వెనుక కారణం తన సినిమాను ప్రమోట్ చేసుకోవడమేనా అనే సందేహాలు వ్యక్తంచేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ప్రస్తుత రాజకీయాలపై కొరటాల శివ ఎక్కుపెట్టిన ట్వీట్ అయితే బాగుంది కానీ.. ఈ ట్వీట్ వెనుకున్న కారణాలని విశ్లేషిస్తూ తనపై వస్తోన్న ఆరోపణలకి కొరటాల ఏం రిప్లై ఇస్తారో చూడాలి మరి.

English summary
All of a sudden, Tollywood director Koratala Shiva has become active on social media and made interesting statements about politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu