»   » ‘శ్రీమంతుడు’ రిలీజ్: వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కొరటాల శివ

‘శ్రీమంతుడు’ రిలీజ్: వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కొరటాల శివ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీమంతుడు'. ఈచిత్రాన్ని జులై 17న విడుదల చేయాలని గతంలోనే నిర్ణయించారు. అయితే భారీ బడ్జెట్ చిత్రం, అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి' చిత్రం విడుదల జులై 10న నిర్ణయించిన నేపథ్యంలో ‘శ్రీమంతుడు' సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.

మహేష్ బాబు నుండి ఇలాంటి ట్వీట్ ఊహించలేదు!


గత కొన్ని రోజులుగా ఈ వార్తలు ప్రచారంలోకి రావడంతో మహేష్ బాబు అభిమానులు అయోమయంలో పడ్డారు. తాజాగా రిలీజ్ విషయమై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. తాము చాలా కాలం క్రితమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ‘శ్రీమంతుడు' సినిమాను జులై 17న విడుదల చేస్తామని అంటున్నారు.


సైమా-2015 రేసులో మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు?


Koratala Siva about Srimanthudu release date

‘చాలా కాలం కాలం క్రితమే రిలీజ్ డేట్ జులై 17న నిర్ణయించాం. దానికే ఫిక్స్ అయి ఉన్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజుల పాటు సాగే ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. జూన్ నెలాఖరున ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.


ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్‌ హీరోయిన్. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.

English summary
“We have finalized the release date long back and decided to stick to July 17th. Except for one week of patchwork, Entire shoot has been completed. We are releasing the audio by the end of June” Koratala Siva said about Srimanthudu.
Please Wait while comments are loading...