twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పగానే మహేష్ నవ్వేశాడు.. వాజ్‌పేయి అనుకున్నారు, చేసేశారు.. కొరటాల!

    |

    సూపర్ స్టార్ మహెష్ బాబు నటించిన భరత్ అనే నెను చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. భరత్ అనే నేను చిత్రంతో కొరటాల వరుసగా నాలుగు ఘనవిజయాలు సాధించిన దర్శకుడిగా నిలిచారు. భరత్ అనే నేను చిత్రం తరువాత టాలీవుడ్ లో కొరటాల పేరు మారుమోగుతోంది. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్న కొరటాల ప్రతిభ గురించే అంతా చర్చించుకుంటున్నారు. తాజగా ఓ ఇంటర్వ్యూ లో కొరటాల భరత్ అనే నేను చిత్రం గురించి పలు విషయాల వెల్లడించారు. ఈ చిత్రం ఎవరినో ఉద్దేశించి తీసింది కాదని కొరటాల అన్నారు. కాంట్రవర్సీ చేయాలనుకునే చీప్ మెంటాలిటీతో ఈ చిత్రం తీయలేదని కొరటాల అన్నారు.

    Recommended Video

    Jayaprakash Narayan Watched Bharat ane Nenu
    ఆ నంబర్స్ అంటే భయం

    ఆ నంబర్స్ అంటే భయం

    టాలీవుడ్ లో కొరటాల ఇప్పుడు నెంబర్ 2 డైరెక్టర్ అని చర్చించుకుంటున్నారు. దీనిగురించి కొరటాల మాట్లాడారు. అలాంటి నంబర్స్ అంటే భయం అని అన్నారు. తాను చేస్తున్న అన్ని చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. అంతవరకు చాలని ఈ నంబర్స్ అవసరం లేదని కొరటాల అన్నారు.

    అలాంటి సినిమా కాదు

    అలాంటి సినిమా కాదు

    పూర్తి స్థాయి మెసేజ్ చిత్రం తెరకెక్కించడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అని కొరటాల అన్నారు. కానీ భరత్ అనే నేను చిత్రంలో ఎటువంటి రిస్క్ లేదని అన్నారు. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సందేశం ఉండడానికి కారణం కొంత వామపక్ష ధోరణి, మరికొంత ముటుంబ నేపథ్యం అని కొరటాల అన్నారు.

    ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటోంది

    ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటోంది

    తన చిత్రాల్లో పాటలని ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటోందని కొరటాల అన్నారు. మిర్చి చిత్రం నుంచే కొన్ని పాటలని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. ఇదంతా సహజమైన విషయమే అని అన్నారు.

    పవన్‌ని వదలడం లేదుగా

    పవన్‌ని వదలడం లేదుగా

    కొరటాల శివ ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా పవన్ కళ్యాణ్ గురించిన ప్రశ్న ఎదురవుతూనే ఉంది. భరత్ అనే నేను కథ పవన్ కళ్యాణ్ కోసం తయారుచేయలేదని కొరటాల అన్నారు. ఐడియా రాగానే గుర్తుకు వచ్చింది మహేషే అని అన్నారు. మహేష్ కు స్టోరీ లైన్ చెప్పిన వెంటనే నవ్వేశారని, మనకెందుకు రాజకీయాలు అన్నారని, ఆ తరువాత తాను మహేష్ ని ఒప్పించానని కొరటాల తెలిపారు.

    పోసానికి, నాకు గొడవలేంటి

    పోసానికి, నాకు గొడవలేంటి

    పోసానితో విభేదాలు ఉన్నాయనే వార్తలపై కొరటాల స్పందించారు. వయసులో వ్యత్యాసం ఉన్నా ఆయనకు నాకు గొడవలేంటి అని అన్నారు. తామిద్దరం కలిసే పెరిగామని కొరటాల తెలిపారు.

    వాజ్‌పేయి అనుకున్నారు

    వాజ్‌పేయి అనుకున్నారు

    రాజకీయ పరిస్థితులపై కూడా కొరటాల గొంతు విప్పారు. రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడూ ఓటు బ్యాంకు పాలిటిక్స్ మాత్రమే కాదని అన్నారు. ఒకప్పుడు రోడ్లు చిన్నవిగా ఉండేవని, కానీ వాజ్ పేయి వచ్చాక ఆయన అనుకున్నారు అంతే, పనైపోయిందని, ఇప్పుడు రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో మనం చూస్తున్నాం అని అన్నారు. పవర్ అంటే అనుకున్నది ఐపోవాలని అన్నారు.

    English summary
    Koratala Siva comments on Atal Bihari Vajpayee. Bharat Ane Nenu is not a risky movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X