»   » నిద్రలేకపోవటం వల్లే విశ్లేషకులకు సినిమా అర్థం కాలేదు: సినీ రివ్యూవర్ల మీద కొరటాల వ్యాఖ్య

నిద్రలేకపోవటం వల్లే విశ్లేషకులకు సినిమా అర్థం కాలేదు: సినీ రివ్యూవర్ల మీద కొరటాల వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాప్ హీరోల సినిమాలకీ, భారీ అంచనాలతో వచ్చే సినిమాలకీ బెనిఫిట్ షోలు వేయటం మామూలే. సినిమాల మీద ప్రేమ ఎక్కువ ఉన్న అభిమానులూ, ప్రేక్షకులూ రిలీజ్ రోజునే తెల్లారేసరికి తమ హీరో చిత్రాన్ని చూసేయాలని అభిమానులు ఉత్సాహపడుతూ ఉంటారు. అందుకే వేలకువేలు పోసి టికెట్లు కొనుక్కోవటం కొత్త విషయమేం కాదు. కనీ ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలవల్ల కూడా ఒక నష్టం ఉందంటూ ఇంట్రస్టింగ్ మాటలు చెప్పారు షివ కొరటాల. జనతా గ్యారేజ్ విషయం లో బెనిఫిట్ షో వల్లే మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చిన విషయం మీద ఆయన స్పందిఒస్తూ.... నిద్ర ఆపుకుంటూ సినిమా చూదటం వల్లే సినిమా ని అర్థం చేసుకోలేకపోయి ఉంటారంటూ చెప్పారు.

ప్రచారం లో ఉన్నంత గొప్పగాలేదనీ, ఈ సినిమా తారక్ కెరీర్ లో ఒక అబౌ ఏవరేజ్ అవుతుంది తప్ప మరీ పెద్ద హిట్ మాత్రం అవదనీ అభిప్రాయాలు వినిపించాయి. నిజానికి ప్రతీసినిమాకి బెనిఫిట్ షో తర్వాత వచ్చే రిపోర్ట్ కీలకం. అప్పటి వరకూ ఉన్న అంచనాలకి ప్రాణం పోస్తూ సినిమా మీద మరింత ఇంట్రస్ట్ కలిగించే సమాచారం బెనిఫిట్ షోనుంచే మొదలవుతుంది.

అప్పటివరకూ మామూలుగా ఉన్న సినీ అభిమానులుకూడా అప్పుడు టికెట్ల కోసం ఎగబడటమా లేక లైట్ తీస్కోవటమా అన్న విషయం ఆలోచిస్తారు. అద్ఫె విధంగా జనతా గ్యారేజ్ కి వేసిన బెనిఫిట్ షో రిపోర్ట్ మాత్రం కొంచం నీరసంగా వచ్చింది. మరీ అనుకున్నంత గొప్పగా లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ అంచనాలన్నింటినీ పక్కకు నెట్టేసి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది జనతా గ్యారేజ్. అంతేకాదు - విడుదలైన 8 రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు కొరటాల శివ.

Koratala Siva Comments on Benefits Shows

జనతా గ్యారేజ్ బెనిఫిట్ షో తరువాత వినిపించిన వ్యాఖ్యలకి కాస్త నిరాషపడ్డాడట కొరటాల. తన కథమీదా.., స్క్రీన్ ప్లే మీదా ఉన్న నమ్మకం తో ఉన్న కొరటాలకి ఆ మాతలు కంగారు పెట్టాయత. అయితే మార్నింగ్ షో తరువాత ఆ అభిప్రాయం మారిపోయిందనీ - సినిమా అద్బుతంగా ఉంది అంటూ వచ్చిన వార్తలు వినపడటం తో కాస్త నెమ్మదించాననీ చెప్పాడు..దీనికి గానూ ఒక కొత్త థియరీ కూడా తయారు చేసి మరీ ఆ బెనిఫిట్ షో వల్ల జరిగే నష్తమేమిటో చెప్పుకొచ్చాడు. అదేమిటంటే...

"బెనిఫిట్ షోలన్నీ తెల్లవారుజామున 3 గంటలకు వేశారు - కాబట్టి విశ్లేషకులందరూ రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఈ సినిమా సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉంటారనీ అందుకే వారి అంచనాలు కాస్త తేడా వచ్చినట్టుగా తనకు అనిపించిందని". కేవలం ఒక్క బెనిఫిట్ షోకి మాత్రమే అలాంటి నెగెటివ్ టాక్ వచ్చిందంటే కారణం... నిద్ర లేకుండా - బాగా అలసిపోయి ఉన్న స్థితిలో సినిమా చూడటమే అయి ఉంటుందని కొరటాల చెప్పుకొచ్చారు.

బెనిఫిట్ షోల తో ఇప్పటివరకూ లాబహమే అనుకుంటున్న వాళ్ళంతా నిర్ఘాంత పోయేలా నిజానికి బెనిఫిట్ షోల పేరుతో కొంతమంది ఇష్టానుసారం టిక్కెట్టు రేట్లు పెంచేసి - క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. మరి వాళ్ళ విషయం లో కొరటాల మాటలు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఏమో.

English summary
Koratala Siva's sensational comments on Movie Benefits Shows.., movie reviews and critics about negetive riport of Janatha garage on first day benifit show
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu