twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటర్లలారా సిగ్గు అనిపించడం లేదా? హైదరాబాద్ ఓటర్లపై కొరటాల శివ ఫైర్

    |

    తెలంగాణ ఎన్నికల ఫీవర్ టాలీవుడ్‌ను భారీగానే తాకింది. సినీ ప్రముఖులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి తమ వంతు బాధ్యతగా ఓటు వేశారు. సినీ తారల రాకంతో జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, బంజరాహిల్స్‌లోని పోలింగ్ సెంటర్లు అభిమానులతో కళకళలాడాయి. ఈ రోజు తమ ఓటును వేసిన సినీ ప్రముఖుల్లో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్ ఓటర్లపై కొరటాల మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..

     తక్కువగా ఓటింగ్ శాతం

    తక్కువగా ఓటింగ్ శాతం

    హైదరాబాద్‌ జంట నగరాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. దాంతో ఓటు వేయాల్సిన బాధ్యతను ఓటర్లు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమూల్యమైన ఓటును వేయని వారిపై తీవ్రంగా స్పందించారు.

    సిగ్గు అనిపించడం లేదా

    సిగ్గు అనిపించడం లేదా

    హైదరాబాద్ ప్రజలకు ఏమైంది. మధ్యాహ్నం వరకు కేవలం 35శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 3 గంటల వరకు తక్కువగా ఓట్లశాతం నమోదైంది. నగర ఓటర్లకు సిగ్గు అనిపించడం లేదా? అని కొరటాల శివ ట్వీట్ చేశారు.

    సామాజిక బాధ్యతగా

    సామాజిక బాధ్యతగా

    సామాజిక బాధ్యత ఉన్న టాలీవుడ్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఆయన రాజకీయ నేపథ్యం, వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి అని తెలిసిందే. అందుకే ప్రజా చైతన్యం కలిగించే సినిమాలు ఆయన రూపొందిస్తుంటారు.

    సమాజంపై కొరటాల శివ

    సమాజంపై కొరటాల శివ

    ఇటీవల కొరటాల శివ రూపొందించిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను తెలియజేశాయి. శ్రీమంతుడులో గ్రామాల దత్తత, జనతా గ్యారేజ్‌లో పర్యావరణం, భరత్ అనే నేను చిత్రంలో నీతివంతమైన రాజకీయాలు, నేతల నడవడికపై సినిమాలు రూపొందించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకొన్న సంగతి తెలిసిందే.

    English summary
    Koratala Siva fires on Hyderabad urban Voter. He tweeted that What’s happening to hyderabad. 35 percent polling till 3 o clock. Shame on the urban voter. #TelanganaAssemblyElections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X