For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రగ్స్ కంటే అదే ఎక్కువ ప్రమాదకరం: ప్రభుత్వాలకు కొరటాల ఫ్రీ అడ్వైజ్

  |

  దాదాపుగా పదీ పదిహేను రోజులుగా మన తెలుగు మీడియా వాడినంత డ్రగ్స్ మరెవరూ వాడలేదు. వాడకం అంటే ఆ ఇష్యూనే అనుకోండి. కానీ ఎప్పుడూ లేనంతగా వార్తలన్నీ ఈ డ్రగ్స్ వార్తలతోనే నిండిపోయాయి. పనిలోపనిగా కొన్ని టీవీ చానెళ్ళు ఏదో పోయి ఇంకేదో చేసినట్టు సినీ దర్శకులని చర్చలకి పిలిచి అక్షింతలు వేయించుకున్నాయి.

  టాలీవుడ్

  టాలీవుడ్

  సినిమా వాళ్ళందరిదీ ఈ విషయం లో ఒకే ప్రశ్న డ్రగ్స్ ని సమర్థించటం లేదు, వాడినవారినీ "ఆ విషయం లో" సపోర్ట్ చేయటం లేదు కానెవె ఎందుకు కేవలం టాలీవుడ్ ని మాత్రమే ఎక్కువ ఫోకస్ లోకి తెస్తున్నారు.? అన్నదే. మొదట్లో డ్రగ్స్ వార్తలు వచ్చిందే కొన్ని స్కూళ్ళూ, రాజకీయ నాయకుల వారసులూ అంటూ కానీ ఎప్పుడైతే టాలీవుడ్ అన్న పేరుకూడా జత కలిసిందో అసలు కేసు రూపమే మారిపోయింది.

  Hyderabad drugs Case : Puri Jagannadh appears before SIT
  ఇండస్ట్రీ లో డ్రగ్స్

  ఇండస్ట్రీ లో డ్రగ్స్

  నిజానికి సినీ ఇండస్ట్రీ లో డ్రగ్స్ వాడకం అన్న ఆరోపణలు ఇప్పుడు కొత్తవేం కాదు. అప్పుడు సినీ ఇండస్ట్రీ ని వేరు చేసి మిగతా సమాజం లో ఉన్న డ్రగ్స్ దందాని ఆపే ప్రయత్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. ప్రజల్లో కూదా అవగాహన పెరిగేది. ఈ పనిని స్కూల్ పిల్లల, రాజకీయ వారసుల పేర్లు బయట పెట్తకుండా కూడా చేయవచ్చు.

  సరైన పద్దతి కాదన్న రీతిలో

  సరైన పద్దతి కాదన్న రీతిలో

  స్కూల్ పిల్లపేర్లు బయట పెడితే వారి భవిశ్యత్తు పాడవుతుందీ అన్న అధికారులు టాలీవుడ్ లో ఉన్న డ్రగ్స్ బాదిత ఆరోపణలు ఎదుర్కుంతున్న ప్రముఖుల పేర్లనే కాదు ఇంటరాగేషన్ లో వాళ్ళేం మాట్లాడారో కూడా లైవ్ టెలీకాస్ట్ రేంజ్ లో విలేకరులకు చేరవేసారన్న ఆరోపణలూ వచ్చాయి... అందుకే ఈ పద్దతి మీద కొందరు సినీ ప్రముఖులు అధికారుల తీరునీ, పత్రికల అత్యుత్సాహాన్నీ "సరైన పద్దతి కాద"న్న రీతిలో మాట్లాడారు.

  సే నో టు డ్రగ్స్

  సే నో టు డ్రగ్స్

  ఒక ప్రక్కన టాలీవుడ్ ప్రముఖులు అందరూ 'సే నో టు డ్రగ్స్' అంటూ నినదిస్తున్న వేళ అసలు మనం ఎందుకు "స్వీయ రక్షణలో" పడ్డట్టు ప్రవర్తించటం అనిపించిందో ఏమోగానీ .. ఇప్పుడు స్టార్ డైరక్టర్ కమ్ రైటర్ కొరటాల శివ తనదైన శైలిలో ఒక మాటన్నాడు. కొరటాల సినిమాలను చూస్తే ఆయనకు సామాజిక స్పృహ ఎంతుందో చెప్పొచ్చు.

  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్

  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్

  ఎప్పుడూ సమాజానికి ఏదో చేయాలనే తపిస్తాడు. అందుకే ఇప్పుడు తను ఏమంటున్నాడంటే.. ''ప్రతీ ప్రభుత్వం అవినీతిని అంతమొందించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నెలకొల్పాలని ఆశిస్తున్నాను. డ్రగ్స్ కంటే కూడా అవినీతి అనేది చాలా ప్రమాదకరం'' అంటూ ట్వీటేశాడు కొరటాల.

  పూరి జగన్ నుండి రవితేజ వరకు

  పూరి జగన్ నుండి రవితేజ వరకు

  ఇప్పుడు టాలీవుడ్లో ఎటు తిరిగినా కూడా చివరకు టాపిక్స్ అన్నీ డ్రగ్స్ దగ్గరే వచ్చి ఆగుతున్నాయి. అందులోనూ పూరి జగన్ నుండి రవితేజ వరకు.. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రశ్నించింది కాబట్టి.. అసలు ఈ కేసు ఏ మలుపు తిరుగుతందో అనే ఆతృత అందరిలోనూ ఉంది.

  రాష్ట్రంలోని మిగతా సమస్యలు

  రాష్ట్రంలోని మిగతా సమస్యలు

  కాని దానికంటే పెద్ద విషయం ఏంటంటే.. అసలు డ్రగ్స్ అనే ఇష్యూను భూతద్దంలో చూపించేసి.. రాష్ట్రంలోని మిగతా సమస్యలను స్కాములను గాలికి వదిలేస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే మాటలను అన్యాపదేశంగా చెప్పాలనుకున్నాడేమో మరి.

  English summary
  Ace filmmaker Koratala Siva has given a free advise to Telangana Government while responding on the Drug Racket Investigation by Special Investigation Team
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X