»   » నరేంద్ర మోడీపై కొరటాల శివ సంచలన ట్వీట్..మహేష్ డైలాగ్ ఉపయోగిస్తూ, ఇండియాలో !

నరేంద్ర మోడీపై కొరటాల శివ సంచలన ట్వీట్..మహేష్ డైలాగ్ ఉపయోగిస్తూ, ఇండియాలో !

Subscribe to Filmibeat Telugu
Bharath Ane Nenu teaser Targets Narendra Modi

వరుస విజయాలతో కొరటాల శివ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారాడు. మూస పద్ధతోలో కాకూండా కమర్షియల్ చిత్రాలకు సోషల్ మెసేజ్ జోడిస్తూ విజయాలు అందుకుంటున్నాడు. కొరటాల శివ రచనా ప్రతిభకు, దర్శకత్వ శైలికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజగా చిత్రం భరత్ అనే నేను. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల భరత్ అనే నేను టీజర్ విడుదలై సునామి సృష్టిస్తోంది. టీజర్ లోని డైలాగ్ ని ఉపయోగిస్తూ తాజాగా కొరటాల శివ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

 వరుస విజయాల దర్శకుడు

వరుస విజయాల దర్శకుడు

కొరటాల శివ అద్భుత విజయాలతో దూసుకుని పోతున్నారు. దర్శకుడిగా కొరటాల తెరకెక్కించిన మూడు చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు మరియు జనతా గ్యారేజ్ ఘనవిజయాలుగా నిలిచాయి.

 కొరటాల కొత్త కమర్షియల్ ఫార్ములా

కొరటాల కొత్త కమర్షియల్ ఫార్ములా

మూస పద్దతిలో వస్తున్న కమర్షియల్ చిత్రాలతో విసిగిపోయిన టాలీవుడ్ ఆడియన్స్ కు కొరటాల రూపంలో కొంత ఉపశమనం లభించింది. కొరటాల తన చిత్రాలని కమర్షియల్ హంగులతో రూపొందించినా అంతర్లీనంగా సామజిక సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత.

 మహేష్ ని శ్రీమంతుడుగా

మహేష్ ని శ్రీమంతుడుగా

మహేష్ బాబుని శ్రీమంతుడిగా అద్భుతంగా ప్రజెంట్ చేసాడు. ఆ చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఊరిని దత్తత తీసుకునే ఫార్ములా ఈ చిత్రంలో సూపర్ సక్సెస్ అయింది.

 ఇప్పుడు ముఖ్యమంత్రిగా

ఇప్పుడు ముఖ్యమంత్రిగా

మహేష్ బాబులతో మరోమరు కొరటాల చేస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబుని కొరటాల ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడు.

 దూసుకుపోతున్న టీజర్

దూసుకుపోతున్న టీజర్

ఇటీవల భరత్ అనే నేను టీజర్ విడుదలయింది. రికార్డు వ్యూస్ లో ఈటీజర్ యూట్యూబ్ లో సునామి సృష్టిస్తోంది. ప్రామిస్ చేసి మాట నిలనేట్టుకోలేనివాడు మనిషి కాదు అంటూ మహేష్ పలుకుతున్న డైలాగులకు అద్భుతమైన స్పందన వస్తోంది.

నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్య

భరత్ అనే నేను చిత్రంలోని డైలాగ్ ని ఉపయోగిస్తూ కొరటాల ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్య చేసారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా నేపథ్యమూ ఏపీలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానిని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలని ఆయనకు గుర్తు చేయండి.. మోడీకి మనిషిగా మారే అవకాశం కల్పించడండి. రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన దృష్టిలో ఇండియాలో భాగం కాదా అంటూ ప్రశ్నించారు.

English summary
Koratala Siva satires on Narendra Modi. Remember his promise to Andhra Pradesh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu