»   » భరత్ అనే నేనుపై అంత నమ్మకమా.. కొరటాల శివ రిస్క్!

భరత్ అనే నేనుపై అంత నమ్మకమా.. కొరటాల శివ రిస్క్!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం భరత్ అనే నేను. ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ కు బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మహేష్ అభిమానులు భరత్ అనే నేను చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కొరటాల శివ భరత్ అనే నేను చిత్రంతో నాలుగో విజయంపై కన్నేశాడు. కొరటాల శివ టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్. మహేష్ సినిమాపై ఉన్న నమ్మకంతో కొరటాల శివ కొత్త రిస్క్ తీసుకోబోతున్నాడు. నైజాం ఏరియాలో కొంత భాగం డిస్ట్రిబ్యూషన్ కూడా కొరటాల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Koratala Siva taking risk on Bharat ane nenu movie

భరత్ అనే నేను చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే కొరటాల ఈ రిస్క్ తీసుకుంటున్నాడట. కొరటాల తన భాగం హక్కులని అమ్ముకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రం నైజాం హక్కులు 22 కోట్ల వరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

English summary
Koratala Siva taking risk on Bharat ane nenu movie. This movie will release on April 20
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X