»   »  బ్యాంకు ఉద్యోగి నుండి నవసర నటుడిగా ‘కోట’ (ఫోటో ఫీచర్)

బ్యాంకు ఉద్యోగి నుండి నవసర నటుడిగా ‘కోట’ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా తెరపై విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో 'కోట శ్రీనివాసరావు' ఒకరు. విలన పాత్ర అయినా, కామెడీ పాత్ర అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర అయినా ఇలా ఏపాత్ర అయినా అవలీలగా పోషించి నవరసాలు పండించగ బహుముఖ నటుడు ఆయన. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ' అవార్డు అందుకున్నారు.

రావు గోపాల రావు తర్వాత తెలుగు విల నిజానికి సరికొత్త సొబగులద్దిన కోట శ్రీనివాసరావు నటుడిగా ఏడు వందల పైచిలుకు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించాడు కోట. జులై 10న ఆయన పుట్టినరోజు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1947, జులై 10న జన్మించారు. బాల్యం నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు.

అతని ప్రవృత్తి మాత్రం నాటకాలు వేయటం. పరిషత్తు పోటీలకు వెళ్ళి ప్రైజులు తేవటం. నాటకం నుంచి రావటం వల్లనేమో కోట డైలాగ్ మాడ్యులేషన్‌లో ఒక ప్రత్యేకత కనపడుతుంది. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది.

ప్రాణం ఖరీదుతో కెరీర్ ప్రారంభం

ప్రాణం ఖరీదుతో కెరీర్ ప్రారంభం


క్రాంతికుమార్‌తో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించారు. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1985 ప్రతిఘటన సినిమా లో ఒక్క నిమిషం పాత్రలో నటించారు. ఆ పాత్రతో నిడివి తక్కువ వున్నా ఆ పాత్రతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ తరువాత కోట శ్రీనివాసరావు వెనుతిరిగి చూడలేదు. ఒక్క హీరో వేషం తప్ప ఆయన అన్ని రకాల పాత్రలూ పోషించారు.

ఎన్నో అద్భుతమైన పాత్రలు

ఎన్నో అద్భుతమైన పాత్రలు


‘ప్రతిఘటన' చిత్రంలో గుడిశెల కాశయ్యగా ఆయన తెలంగాణా యాసను బాగా వెలుగులోకి తెచ్చారు. యమలీల చిత్రంలో మాంత్రికుడిగా, గాయం చిత్రంలో పొలిటికల్‍ గూండాగా, అహ నా పెళ్ళంట చిత్రంలో బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్‌లతో కలసి అద్భుతమైన కామెడిని పండించారు కోట శ్రీనివాసరావు.

మనీ చిత్రంలో పాత్ర సూపర్

మనీ చిత్రంలో పాత్ర సూపర్


మనీ చిత్రంలో ఉత్తేజ్‍కి పెళ్ళిచేసుకోవద్దని చెప్పే సీన్లో ఆయన ఇంగ్లీష్ భాష భలే తమాషాగా ఉంటుంది. అలాగే ఆ చిత్రంలో భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ-భర్తగ మారకు బ్యాసులరూ అనే పాటలో ఆయన నటన కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోట నటించిన 200 ఫైగా చిత్రాల గురించీచెప్పవలసి ఉంటుంది.

అమితాబ్‌తో...

అమితాబ్‌తో...


అమితాబ్‍ బచ్చన్ వంటి గొప్ప నటుడితో కలసి ‘సర్కార్' అనే హిందీ చిత్రంలో నటించటం గొప్ప అనుభూతి అని అంటారు కోట శ్రీనివాసరావు.

ఎన్టీఆర్ తో నటించలేక పోయాడు...

ఎన్టీఆర్ తో నటించలేక పోయాడు...


చాలామంది పాత, కొత్త టీనటులందరితో నటించినా ఒక మహానటుడితో నటించలేదనే లోటు తనకెప్పుడూ బాధ కలిగిస్తుందనీ అంటుంటారాయన. ఆయనే మహానటుడు ఎన్.టి.ఆర్‌‍. "మేజర్ చంద్రకాంత్" చిత్రంలో ఆయనతో నటించే అవకాశం వచ్చినా, తనకు డేట్స్ కుదరకపోవటం వల్ల ఆ పాత్రను పరుచూరి గోపాల కృష్ణ పోషించారనీ అన్నారాయన.

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే ఈ స్థాయికి

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే ఈ స్థాయికి


వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అందులో లీనమై పోవడానికి ప్రయత్నిస్తుంటానని..అందుకే కొన్ని చిత్రాలు తనకు పేరు తెచ్చాయన్నారు. తాను మాత్రం 'హీరో'గా అయ్యే దానికి ప్రయత్నించలేదని..హీరోగానో..దర్శకుడిగా లేదా నిర్మాతగా అయి ఉంటే వీడికెందుకురా ఈ పనులు అని కొందరు పరచాకాలు ఆడి ఉండేవారని కోట శ్రీనివాస్‌రావు తెలిపారు. పరిశ్రమకు ఎంతగానే తాను రుణపడి ఉంటానని ఎప్పుడూ చెబుతుంటారు.

English summary
Tollywood actor Kota Srinivasa Rao Birthday today. He is a versatile Indian film actor in Telugu Cinema. He is known for his negative roles, character roles and comedy timing in telugu films from the past 20 years.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu