For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు...స్పందన

  By Srikanya
  |

  హైదరాబాద్: దాదాపు 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు కి భారత ప్రభుత్వం నుంచి అరుదైన ఘనత దక్కింది. ఈ విలక్షణ నటుడుని పద్మ అవార్డులలో భాగంగా పద్మ శ్రీ తో భారత ప్రభుతం సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా. ఇక్కడ నిర్మాతలు, దర్శకులు అందించిన ప్రోత్సాహంతో నిలబడ్డాను. నా విజయాల వెనుక, అందుకొనే పురస్కారాల వెనుక సినీ పరిశ్రమలోని అందరి కృషి ఉంది. ఇన్నేళ్లుగా సీనీ రంగానికి నేను చేసిన సేవకు, నా నటనకు గుర్తింపుగా ప్రభుత్వం నాకీ పురస్కారం అందించిందని భావిస్తున్నాను. నేనెప్పుడూ బాధ్యతతోనే వ్యవహరించా. ఇక ముందు మరింత బాధ్యతతో పనిచేస్తా. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నా'' అన్నారు.

  కోట కెరీర్ విషయానికి వస్తే....

  Kota Srinivasa Rao honored with Padmasri

  1978లో వచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోట శ్రీనివాసరావు అనతి కాలంలోనే తన నటనలోని టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రని వేసుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించాడు. కోట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా పలు విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు.

  పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా కోట శ్రీనివాసరావుకి వన్ ఇండియా తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

  ఈ సంవత్సరం పద్మ అవార్డులు పూర్తి వివరాల్లోకి వెళ్తే...

  భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ మొత్తం 104 మందికి ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  అవార్డులు పొందినవారు: పద్మవిభూషణ్ : బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, బీజేపీ అగ్ర నేత ఎల్ కే అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, వీరేంద్ర హెగ్డే, ప్రొఫెసర్ మల్లార్ రామస్వామి, కొట్టాయన్ కె వేణుగోపాల్, కరీమ్ ఆల్ హుసేని ఆగా ఖాన్, పద్మభూషణ్: మైక్రోసాప్ట్ చీఫ్ బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్, సాహితీవేత్త రంజిత్ శర్మ, స్వపన్ దాస్ గుప్త, మాజీ సీఈసీ ఎన్ గోపాలస్వామి, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సీ కస్యప్, న్యాయవాది హరీష్ సాల్వే, విజయ్ భక్తర్, కార్డియాలజిస్ట్ అశోక్ సేత్, సినీ నిర్మాత జాను బారువా. సత్పాల్, శివకుమార్ స్వామి, ఆచార్య మంజుల్ భార్గవ్

  పద్మశ్రీ: సినీ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు, ఆధ్యాత్మిక గురువు దివంగత సైయద్ మెహ్మద్ బుర్హానుద్దీన్, పాటల రచయిత జోషి, టీవీ మోహన్ దాస్ పై.

  English summary
  Actor, Kota Srinivasa Rao has been conferred with the prestigious Padmasri award by the Indian government.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X