Don't Miss!
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Finance
Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అతని దగ్గర అప్పు తీసుకున్నా.. ఆ బాకీ అలాగే ఉండిపోయింది.. కోట శ్రీనివాస రావు ఆవేదన
ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే వేణు మాధవ్ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు పలువురు సినీ ప్రముఖులు. వేణు మాధవ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మదన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేణు మాధవ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆవేదన చెందారు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు. వివరాల్లోకి పోతే..

ఎందరో కమెడియన్లతో షేరింగ్
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సంప్రదాయం' సినిమాతో వెండితెరపై కాలుమోపిన వేణు మాధవ్ కొన్ని వందల సినిమాల్లో నటించారు. అందరు టాలీవుడ్ కమెడియన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. షూటింగ్ సమయంలో సెట్లో ఎంత యాక్టివ్‌గా ఉండేవారో.. బయట కూడా అంతే యాక్టివ్‌గా ఉండేవారట వేణు మాధవ్. ఆయన మరణం తర్వాత ఎంతోమంది మీడియాతో చెప్పిన విషయమిది.

గుర్తు చేసుకున్న కోట శ్రీనివాస రావు
వేణు మాధవ్ మరణం తనను ఎంతో కలచి వేసిందని తెలుపుతూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు. వేణు మాధవ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఐదారు కళలు ఉన్నాయని చెప్పారు. తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుక జరిగినప్పుడు రామలింగయ్య గారి 'ముత్యాలు వస్తారా' పాటపై వేణు మాధవ్ చూపిన అభినయం అబ్బురపరిచిందని పేర్కొన్నారు. స్వయంగా రామలింగయ్యగారే వచ్చినట్టు అనిపించిందని కోట అన్నారు.

వేణు మాధవ్‌ని దగ్గర అప్పు తీసుకున్నా..
ఓ సారి ఎయిర్ పోర్ట్‌లో షాపింగ్ చేస్తుంటే అనుకోకుండా 2 వేల రూపాయలు తక్కువ పడ్డాయి. ఆ సమయంలో వేణు మాధవ్ పక్కనే ఉండటంతో ఓ రెండు వేలు కాలనీ అడిగా. వెంటనే ఆయన తీసుకో బాబాయ్ అని ఇచ్చేశాడు. ఆ తరువాత ఆ అప్పడు తిరిగి చెల్లించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా వేణు మాధవ్ తీసుకోలేదని అన్నారు కోట.

ఆ బాకీ అలాగే ఉండిపోయింది
ఎందుకు తీసుకోవడం లేదని తాను అడిగితే.. ఓ మహానటుడు నాకు అప్పు ఉన్నాడు అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుందని చెప్పేవాడని కోట అన్నారు. దీంతో ఆ రెండువేల బాకీ అలాగే ఉండిపోయింది. అంత మంచి మనిషి చిన్న వయసులో చనిపోవడం బాధగా ఉందని చెబుతూ ఆవేదన చెందారు కోట. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు.