»   »  అదేం కామెడీ?.....బ్రహ్మానందంపై కోట షాకింగ్ కామెంట్

అదేం కామెడీ?.....బ్రహ్మానందంపై కోట షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన బ్రహ్మానందం మీద చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది.

బ్ర‌హ్మానందం ఆరేళ్లుగా ఒకే వేషం మీద బ‌తుకుతున్నాడు. త‌న‌కు కోపం వ‌చ్చినా ఫ‌ర‌వాలేదు. ఎందుకంటే బ్ర‌హ్మానందం అద్భుత‌మైన ఆర్టిస్ట్. ఎటువంటి పాత్ర‌నైనా చేయ‌గ‌ల‌డు. చెప్పి చేయించుకోవ‌డంలో ఉంటుంది. అయితే అత‌నికి రొటీన్ పాత్ర‌లు ఇస్తున్నారు. ఇప్ప‌డు వ‌స్తున్న ప్ర‌తి సినిమాలో ప్ర‌తి ఒక్క‌డు బ్ర‌హ్మాన్ని కొట్ట‌డం...అది చూసి జ‌నం న‌వ్వుకోవ‌డం...ఇదేనా కామెడీ అంటే? అంటూ ఘాటుగా స్పందించారు కోట.

Kota Srinivasa Rao shocking comments on Brahmanandam

ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న హీరోల డామినేషన్ ట్రెండు మీద కూడా కోట తనదైన రీతిలో స్పందించారు. ఒకప్పుడు హీరో పాత్రలతో సరిసమానంగా విలన్ పాత్రలు ఉండేవని, సత్యనారాయణ రావుగోపాలరావులతో పాటు తన హయాంలో రూపొందిన సినిమాలలో తమకు ఎంతో ప్రాముఖ్యత ఉండే విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు కోట.

ప్రస్తుతం హీరోల డామినేషన్ పెరిగి పోయిందని, కామెడీతో సహా అన్ని రకాల షేడ్స్ ను హీరోలు చేస్తూ ఉండటంతో విలన్ పాత్రకు ప్రాధాన్యత తగ్గి ఒక జోకర్ గా మారిపోతున్నాడని కోట చెప్పుకొచ్చారు. ఇతర బాషా నటులకు తెలుగులో ప్రధాన్యత పెరిగిపోవడంపై స్పందిస్తూ....నానపాటేకర్, నసీరుద్దీన్ షా లాంటి గొప్పనటుల పక్కన చిన్న పాత్రలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ....నటన భాష రాని పరభాష విలన్స్ ముందు చిన్న పాత్రలు చేయడం నచ్చదని తెగేసి చెప్పారు కోట.

English summary
Kota Srinivasa Rao shocking comments about Brahmanandam comedy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu