»   »  'కొత్త బంగారు లోకం' సెప్టెంబర్ 19న...

'కొత్త బంగారు లోకం' సెప్టెంబర్ 19న...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kotha Bangaru Lokam
సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా' కొత్త బంగారు లోకం' అనే సినిమాను ఫ్రారంబించిన సంగతి తెలిసిందే. మీడియాకి, పబ్లిసిటీకి దూరంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టంబర్ 19 న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. Waiting for you అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ద్వారా అడ్డాల శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు.

గతంలో దిల్ రాజు బ్యానర్ లో డైరక్షన్ డిపార్టమెంటు లో పనిచేసిన ఈ యువ దర్శకుడు ఓ హిందీ సినిమాకు ప్రేరణ చెంది కథ చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక మిక్కీజె.మేయర్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు. శ్రీ వెంకటేస్వర క్రియేషన్స్ పై రెడీ అయిన ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ లో శ్వేత వర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X