twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ఇంతకాలం మౌనం, చరిత్ర వక్రీకరించారు: ‘మణికర్ణిక’పై క్రిష్ సంచలనం!

    |

    బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఝాన్సీ లక్ష్మీభాయి బయోపిక్ 'మణికర్ణిక' మొదలవ్వడం క్రిష్ దర్శకత్వంలో అయినప్పటికీ ముగింపు హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకత్వంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ మధ్యలోనే తప్పుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ దర్శకత్వంలో పూర్తి చేశారు.

    అసలు ఏం జరిగింది? ఆ సినిమా నుంచి క్రిష్ ఎందుకు తప్పుకున్నారు? అంత పెద్ద ప్రాజెక్టును మధ్యలో వదిలేసి 'ఎన్టీఆర్ బయోపిక్' బాధ్యతలు చేపట్టడానికి కారణం ఏమిటనేది చర్చనీయాంశం అయింది. 'మణికర్ణిక' చిత్ర బృందం క్రిష్ తప్పుకోవడానికి కారణం ప్రాజెక్టు లేటవ్వడం, ఎన్టీఆర్ బయోపిక్‌కు కమిటవ్వడమే అని చెప్పినా... దీని వెనక ఇంకేదో వివాదం ఉందనే అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.

    ‘మణికర్ణిక' ఇష్యూపై స్పందించిన క్రిష్

    ‘మణికర్ణిక' ఇష్యూపై స్పందించిన క్రిష్

    తాజాగా క్రిష్ ఓ పత్రిక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అసలు విషయం చెప్పారు. ‘మణికర్ణిక' చిత్రాన్ని 109 రోజుల్లో పూర్తి చేశాం. ఏప్రిల్‌ 27న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధమైంది. తర్వాత రిలీజ్ డేట్ ఆగస్టు 15కు మార్చారు అని వెల్లడించారు.

    ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్ఎన్టీఆర్: కథానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

    అప్పుడే ‘ఎన్టీఆర్ బయోపిక్' అవకాశం వచ్చింది

    అప్పుడే ‘ఎన్టీఆర్ బయోపిక్' అవకాశం వచ్చింది

    ‘మణికర్ణిక' రీ రికార్డింగ్‌ సమయంలోనే ‘ఎన్టీఆర్‌ బయోపిక్' అవకాశం వచ్చింది. ‘మణికర్ణిక' ప్యాచ్ వర్క్ మిగిలి ఉండటంతో 15 రోజుల్లో దాన్ని పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రాజెక్టు మీదకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లు క్రిష్ వెల్లడించారు.

    నా చేతులో నుంచి మరొకరి చేతిలోకి వెళ్లగానే మార్పులు

    నా చేతులో నుంచి మరొకరి చేతిలోకి వెళ్లగానే మార్పులు

    సినిమా నా చేతుల్లో నుంచి మరొకరి చేతిలోకి వెళ్లగానే మార్పులు మొదలు పెట్టారు. సోనూ సూద్‌ను తొలగించి మరొకరితో ఆ సన్నివేశాలు రీ షూట్ చేశారు. అసలు గొడవ అక్కడే మొదలైంది. ఆయన తన పాత్రకు వందశాతం న్యాయం చేసినా ఆ మార్పు చేయడం నాకు నచ్చలేదు... అని క్రిష్ తెలిపారు.

    కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారు

    కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారు

    సినిమా నా చేతులు మారిన తర్వాత కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారు. ఈ విషయం గురించి నేను మాట్లాడితే సినిమాకు చెడ్డపేరు వస్తుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉంటున్నాను అని క్రిష్ తెలిపారు.

    అది నా సినిమానే..

    అది నా సినిమానే..

    ‘మణికర్ణిక' సినిమాతో సంప్రదింపులు జరుగుతుననాయి. అది నా సినిమానే.... అని క్రిష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

    మణికర్ణిక

    మణికర్ణిక

    నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ‘మణికర్ణిక' తెరకెక్కించారు. జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Krish Jagarlamudi about Manikarnika issue. Manikarnika - The Queen Of Jhansi Official Telugu Trailer has released today. Starring Kangana in the lead role, The film, which was initially directed by Krish before Kangana, will release on January 25.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X