»   » దాసరి లేరనకండి.. పెద్దాయన విశ్రాంతి తీసుకొంటున్నారు.. క్రిష్ ఉద్వేగంగా

దాసరి లేరనకండి.. పెద్దాయన విశ్రాంతి తీసుకొంటున్నారు.. క్రిష్ ఉద్వేగంగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన దర్శక ధీరుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరన్న విషయాన్ని సినీ కార్మికులు, ప్రముఖులు, సాంకేతిక నిపుణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అండ ఇకలేదన్న బాధతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆయనతో ఉన్నఅనుబంధాన్ని పలువురు పంచుకొంటున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేసిన ట్వీట్ పలువురిని ఉద్వేగానికి గురిచేసింది.

దాసరి గుండె ఆడకపోతే..

దాసరి గుండె ఆడకపోతే..

దాసరి గుండె ఆడకపోతే ఏం? రవి అస్తమించిన ఈ భూప్రపంచం అంతటా ఆయన సినిమా ఏదో ఒక మూలన ఆడుతూనే ఉంటుంది. తాతా మనవడు నుంచి ఎర్రబస్సు వరకు ఆయన తీసిన 151 చిత్రాలు ఉన్నాయి. థియేటర్స్‌లోనో, టెలివిజన్ ఛానెళ్లలోనో ప్రదర్శింపబడుతుంటాయి.

సినిమా లేనప్పుడు దాసరి

సినిమా లేనప్పుడు దాసరి

ఈ భూ ప్రపంచం మీద సినిమా అనేది లేకపోయినప్పడు దాసరిగారు లేరు అనాలి. అది ముమ్మాటికి జరుగుదు. భౌతికంగా దాసరి మన మధ్య లేకపోయినా ఆయన రూపొందించిన సినిమాలు దాసరిని చిరంజీవిగా, సజీవంగా ఉంచుతాయి అనే అభిప్రాయాన్ని క్రిష్ వ్యక్తం చేశారు.

జయజయద్వానాలే.. జోహర్లు ఉండవు..

జయజయద్వానాలే.. జోహర్లు ఉండవు..

దాసరిగారంటే 74 ఏళ్లు నిండిన వ్యక్తి కాదు. 24 శాఖలు కలిసిన శక్తి. అలాంటి మహానుభావులకు జయజయద్వానాలు ఉంటాయి కానీ జోహర్లు ఉండవు అని ఎమోషనల్‌గా స్పందించారు.

తెలుగు దర్శకుడికి గౌరవం దక్కితే..

దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని ఎవరైనా, ఎక్కడైనా అంటే దాసరిగారు వింటారు. సంతోషపడుతారు. తెలుగు దర్శకుడికి ఏ గౌరవం దక్కినా అందులో దాసరి గారు ఉంటారు. పెద్దాయన విశ్రాంతి తీసుకొంటున్నారు. లేరనకండి.. వింటారు అని క్రిష్ జాగర్లమూడి ఓ ప్రకటన రూపంలో ట్వీట్ చేశాడు.

English summary
Tollywood directo Krish Jagarlamudi posted emotional tweet in wake of Dasari Narayana Rao demise. He said Dont say Dasari no more. He lives till cinema is there on earth. Just Dasari is taking rest. whenever a telugu director gets recognisation he will feel proud.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu