»   » కృష్ణ, రాఘవేంద్రరావులకు.... కేసీఆర్ సహాయం??

కృష్ణ, రాఘవేంద్రరావులకు.... కేసీఆర్ సహాయం??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రముఖులైన రాఘవేంద్రరావు, సూపర్ స్టార్ కృష్ణలు ఆ మధ్య ఓ భూవివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ భూముల విషయమై వారు నోటీసులు సైతం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ భూముల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా వారు భూ వివాదం నుండి బయట పడినట్లే కనిపిస్తోంది. వీరికి తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ హెల్ప్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మద్రాసు నుండి తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడంలో భాగంగా అప్పట్లో స్టార్ నటుడిగా ఉన్న కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొంత భూమిని చౌకగా పొందారు. ఈ భూమిలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయి. అనంతరం కృష్ణ ఆ భూమిలో పద్మాలయా స్టూడియోస్ నిర్మించారు. అయితే తర్వాత కొన్ని ఇబ్బందులతో ఆ భూమిలో 8.5 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా వేరొకరికి కట్టబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై రాజకీయంగా పెద్ద దుమారమే లేచింది.

Krishna, Raghavendra Rao Saved??

రాఘవేంద్రావు కూడా ఇలాంటి భూ వివాదంలోనే అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా సౌండ్ రికార్డింగ్ స్టూడియో, ఎడిటింగుకు సంబంధించిన స్టూడియో కట్టడానికి బంజారా హిల్స్ లో భూమిని తీసుకున్న ఆయన వ్యాపారపరమైన సినిమాక్స్ బిల్డింగ్ నిర్మించడం అప్పట్లో వివాదాస్పదం అయింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన తర్వాత ఈ వివాదాల నుండి కృష్ణ, రాఘ వేంద్రరావు బయట పడేందుకు సహాయం చేసారని ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఈ మధ్య కాలంలో ఈ వివాదాలు దాదాపుగా మరుగున పడినట్లే ఉన్నాయి. ఈ భూములపై ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేక పోవడం కూడా కేసీఆర్...వారికి హెల్ప్ చేసాడనే వాదనకు బలం చేకూరుతోంది.

English summary
Krishna and Raghavendra Rao haven't expected that the land that was given to them nearly 1 Rupee per yard would push them into troubles in the future. At the peak of Telangana movement, even court cases are lodged on the properties owned by these two. Going by Telangana Chief Minister KCR's words, seems like they are bailed out of troubled waters.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu