twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయలలితను నా కూతురి పెళ్లికి రావొద్దన్నా: సూపర్ స్టార్ కృష్ణ!

    జయలలిత మృతి సందర్భంగా ఆమెతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు సూపర్‌ స్టార్‌ కృష్ణ.

    By Srikanya
    |

    హైదరాబాద్ : వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ... జయలలిత లాంటి గొప్ప వ్యక్తిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పెళ్లికి పిలుస్తారు. అలాంటిది రావద్దనటం ఏమిటి..అదీ తనతో సినిమాలు చేసిన హీరో వద్దనటం విచిత్రమే. అదెలా జరిగిందో క్రింద చదవండి.

    జయలలిత సూపర్‌స్టార్‌ కృష్ణతో 'గూఢాచారి 116', 'నిలువు దోపిడీ' వంటి సినిమాల్లో కలిసి నటించారు. జయ మృతి సందర్భంగా ఆమెతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు సూపర్‌ స్టార్‌ కృష్ణ. తన పెద్దకూతురు పద్మావతి పెళ్లికి జయలలితను రావొద్దని చెప్పానని షాక్‌ ఇచ్చారు కృష్ణ.

    కృష్ణ మాట్లాడుతూ...కృష్ణ కూతురు పద్మావతి పెళ్లి చెన్నైలో జరుగుతున్న సమయానికి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన కూతురు పెళ్లికి రావాల్సిందిగా జయను ఆహ్వానించారట కృష్ణ. ఆయన ఆహ్వానాన్ని మన్నించి తప్పక వస్తానని చెప్పారట జయ.

    అయితే మూడ్రోజులు పోయిన తర్వాత ఆమె సెక్యూరిటీ అధికారి కృష్ణ వద్దకు వచ్చి.. భద్రతా కారణాల రీత్యా మండపంలోని మొదటి మూడు వరసలను ముఖ్యమంత్రికి, ఆమె సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించమని చెప్పారట. ఆ అధికారి చెప్పిన విషయానికి కృష్ణ షాక్‌ అయ్యారట.

    ఆ పెళ్లికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి మూడు వరసలు జయలలిత కోసమే కేటాయించడం కష్టమని కృష్ణ అభిప్రాయపడ్డారట. అందుకే తన ఇబ్బందులను స్వయంగా జయలలితకు తెలియజేసి పెళ్లికి రావొద్దని సున్నితంగా తెలియజేశారట. కృష్ణ వివరణకు నవ్వుకున్న జయలలిత సరే అన్నారట. అయితే పెళ్లి రోజున కృష్ణ కూతురిని ఆశీర్వదిస్తూ ఓ బొకే పంపారట జయలలిత.

    Krishna Says Jayalalitha Not to Attend His Daughter Marriage?

    కృష్ణ కంటిన్యూ చేస్తూ...''గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె నటించారు. ఆ సినిమా కూడా హండ్రెడ్‌ డేస్‌ ఆడింది. అలాగే మేం సొంతంగా నిర్మించిన సినిమా దేవుడు చేసిన మనుషులు చిత్రంలో రామారావుగారి పక్కన ఆమె హీరోయిన్‌గా నటించింది. అది కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి రాజ్యసభ సభ్యురాలయ్యారు.

    ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తమిళనాడు ప్రజలు ఆమెను ఎంతో అభిమానంతో అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేదలకు హెల్ప్‌ చేసే మంచి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో ఎప్పుడూ ఒక పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్‌ట్‌ ఎలక్షన్స్‌లో మరో పార్టీ అధికారంలోకి వచ్చేది.

    అలా కాకుండా లాస్ట్‌ టైమ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికై తర్వాతి ఎలక్షన్స్‌లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడం తమిళనాడులో చాలా అరుదైన విషయం. ప్రజల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం తమిళనాడు ప్రజలకి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అని సూపర్‌స్టార్‌ కృష్ణ చెప్పారు.

    English summary
    Superstar Krsihna Revealed That He Said Jayalalitha Not to Attend For Daughter Marriage .This News Gave Shock to Everyone, So Let’s Go to The Complete Details About It.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X