»   » అలా చేస్తే వ్యభిచారం చేసినట్లే ఫీలవుతా..,

అలా చేస్తే వ్యభిచారం చేసినట్లే ఫీలవుతా..,

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు మంచి విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, అంత:పురం లాంటి సినిమాలతో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో కృష్ణ వంశీ సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఒక వేళ వచ్చినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. 2014 తర్వాత ఆయన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. మరి ఇంత గ్యాప్ ఎందుకు వస్తోంది అంటే తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నాడట.

తాను డబ్బుల కోసమే సినిమాల తీసే రకం కాదని అంటున్నాడట. కేవలం డబ్బు కోసమే సినిమాలు తీయాల్సి వస్తే కొన్ని సార్లు మనసుకు నచ్చక పోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. నిర్మాత ముందు తలొంచుకుని ఉండాల్సి వస్తుంది. అలా చేయడం నాకు నచ్చదు. తలొంచి సినిమా తీస్తే వ్యభిచారం చేసినట్లుగా ఫీలవుతా అంటూ తనదైన స్టైల్ లో డైలాగులు కొడుతున్నాడట కృష్ణ వంశీ.

Krishna Vamsi about his film Career

అలా నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లడటం నా ఉద్దేశ్యం కాదు...అందరికంటే నేనే గొప్ప అని కూడా అనడంలేదు, అందరిలా సినిమాలు చేయడం కాకుండా ప్రత్యేకంగా చేయాలనే ఉద్దశ్యంతోనే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారట ఈ క్రియేటివ్ డైరెక్టర్.

ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె..శ్రీనివాసులు మరియు విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా 'నక్షత్రం' అనే సినిమా తెరకెక్కుతోంది. . యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది.

English summary
Krishna Vamsi said about his film Career and upcoming movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu