»   » "డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియా చాలా తుంటరిగా వ్యవహరించింది: కృష్ణవంశీ

"డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియా చాలా తుంటరిగా వ్యవహరించింది: కృష్ణవంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపుగా పదీ పదిహేను రోజులుగా మన తెలుగు మీడియా వాడినంత డ్రగ్స్ మరెవరూ వాడలేదు. వాడకం అంటే ఆ ఇష్యూనే అనుకోండి. కానీ ఎప్పుడూ లేనంతగా వార్తలన్నీ ఈ డ్రగ్స్ వార్తలతోనే నిండిపోయాయి. పనిలోపనిగా కొన్ని టీవీ చానెళ్ళు ఏదో పోయి ఇంకేదో చేసినట్టు సినీ దర్శకులని చర్చలకి పిలిచి అక్షింతలు వేయించుకున్నాయి.

ఎందుకు కేవలం టాలీవుడ్ ని మాత్రమే

ఎందుకు కేవలం టాలీవుడ్ ని మాత్రమే

సినిమా వాళ్ళందరిదీ ఈ విషయం లో ఒకే ప్రశ్న డ్రగ్స్ ని సమర్థించటం లేదు, వాడినవారినీ "ఆ విషయం లో" సపోర్ట్ చేయటం లేదు కానీ ఎందుకు కేవలం టాలీవుడ్ ని మాత్రమే ఎక్కువ ఫోకస్ లోకి తెస్తున్నారు.? అన్నదే. మొదట్లో డ్రగ్స్ వార్తలు వచ్చిందే కొన్ని స్కూళ్ళూ, రాజకీయ నాయకుల వారసులూ అంటూ కానీ ఎప్పుడైతే టాలీవుడ్ అన్న పేరుకూడా జత కలిసిందో అసలు కేసు రూపమే మారిపోయింది.

Krishna Vamshi Condemned Allegation which Targetted by few Heros
ఆరోపణలు వచ్చాయి

ఆరోపణలు వచ్చాయి

స్కూల్ పిల్లపేర్లు బయట పెడితే వారి భవిశ్యత్తు పాడవుతుందీ అన్న అధికారులు టాలీవుడ్ లో ఉన్న డ్రగ్స్ బాదిత ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖుల పేర్లనే కాదు ఇంటరాగేషన్ లో వాళ్ళేం మాట్లాడారో కూడా లైవ్ టెలీకాస్ట్ రేంజ్ లో విలేకరులకు చేరవేసారన్న ఆరోపణలూ వచ్చాయి...

దర్శకుడు కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీ

అందుకే ఈ పద్దతి మీద కొందరు సినీ ప్రముఖులు అధికారుల తీరునీ, పత్రికల అత్యుత్సాహాన్నీ "సరైన పద్దతి కాద"న్న రీతిలో మాట్లాడారు. ఇదే విషయం మీద టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ కూడా స్పందించాడు "డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియా చాలా తుంటరిగా వ్యవహరించింది.

‘శివ' సినిమాకు జూనియర్ ఆర్టిస్టుగా

‘శివ' సినిమాకు జూనియర్ ఆర్టిస్టుగా

ఈ విషయాన్ని అన్నిసార్లు చూపించాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ‘శివ' సినిమాకు జూనియర్ ఆర్టిస్టుగా వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. అతను గొప్ప మనసున్న వ్యక్తి. ఎంతోమందికి సాయం చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని విప్లవాత్మకంగా తట్టి లేపేలా చెప్పాలని ప్రయత్నిస్తాడు.

దగుల్బాజీగా సినిమాలు తీసేసి

దగుల్బాజీగా సినిమాలు తీసేసి

దగుల్బాజీగా సినిమాలు తీసేసి డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. పదిమందికి సాయం చేసిన అతను ఈ కేసులో ఉన్నాడన్న వార్త వినగానే ఏడుపొచ్చేసింది. అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్నది తనకు.. ఎక్సైజ్ వాళ్లకు సంబంధించిన విషయం. దానిపై నేను జడ్జిమెంట్.. కామెంట్ చెప్పే స్థితిలో లేను.

ఖండిస్తున్నా

ఖండిస్తున్నా

ఐతే వాళ్లను ఎటాక్ చేయడాన్ని బాధతో ఖండిస్తున్నా. పూర్తి వివరాలు తెలియకుండా పగతో చేస్తున్నట్లుగా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వాళ్లకు కూడా కుటుంబాలున్నాయి. వాళ్లూ బతకాలి కదా. ఈ వ్యవహారంపై మా బాస్ రామ్ గోపాల్ వర్మ సరిగ్గా స్పందించారు. న్యూస్ ను గ్లామరైజ్.. డ్రమటైజ్ చేస్తున్నారు. తోటి మనిషి మీద మనవాడు అన్న భావన లేకపోవడం దీనికి కారణం అని తేల్చాడు కృష్ణవంశీ.

English summary
Director Krishna Vamsi lashed out at media about Puri Jagannadh Drugs Controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X