»   » రికార్డులన్నీ ‘1 నేనొక్కడినే’తో బద్దల్: కృష్ణ (ఫోటోలు)

రికార్డులన్నీ ‘1 నేనొక్కడినే’తో బద్దల్: కృష్ణ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన తనయుడు మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రాన్ని సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ శుక్రవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్‌లో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా హాలీవుడ్ స్థాయిలో అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదని తన అభిప్రాయమని, హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉందని, ఈచిత్రం మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందనే నమ్మకం ఉందని, ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో రికార్డులు బద్దలు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు కృష్ణ. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, తెరంగ్రేటంలోనే గౌతం చాలా బాగా నటించాడని కృష్ణ చెప్పుకొచ్చారు.

నటుడు నరేష్ మాట్లాడుతూ....కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు మార్పుకోరుకుంటున్నారని, ఆ మార్పుకు తగిన విధంగా '1 నేనొక్కడినే' సినిమా ఉందని అన్నారు. మూస సినిమాల ధోరణిలో కాకుండా కొత్తగా, అద్భుతంగా ఉందని. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కొత్త సినిమాతో పాటు కొత్త మహేష్ బాబును చూస్తారని, మహేష్ లుక్ చాలా బాగుందని తెలిపారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ హిట్ అవుతుందన్నారు నరేష్.

స్లైడ్ షోలో ఫోటోలు, సినిమా వివరాలు...

రికార్డు బద్దలయ్యే సినిమా అంటున్న కృష్ణ

రికార్డు బద్దలయ్యే సినిమా అంటున్న కృష్ణ


‘1 నేనొక్కడినే' చిత్రం ఇప్పటి వరకు వచ్చిన అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని సినీయర్ సూపర్ స్టార్ కృష్ణ అన్నారు.

1 నేనొక్కడినే

1 నేనొక్కడినే


సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

నిర్మాతలు

నిర్మాతలు


14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

నరేష్

నరేష్


నటుడు నరేష్ మాట్లాడుతూ..... మూస సినిమాల ధోరణిలో కాకుండా కొత్తగా, అద్భుతంగా ఉందని. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కొత్త సినిమాతో పాటు కొత్త మహేష్ బాబును చూస్తారని, మహేష్ లుక్ చాలా బాగుందని తెలిపారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ హిట్ అవుతుందన్నారు.

హాలీవుడ్ స్టాండర్స్

హాలీవుడ్ స్టాండర్స్


‘1 నేనొక్కడినే' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్‌లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే ఈచిత్రం తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా లేదనేది మరికొందరి వాదన.

English summary
Krishna watches 1 Nenokkadine movie at Prasad labs, Hyderabad. Mahesh Babu's 1: Nenokkadine, which has been directed by Sukumar, is one of the most-talked about and highly-anticipated Telugu movies. The promos of the film have created lot of curiosity among the viewers. Having released in theatres today, the movie is much more than what has been expected from it. Made on par with Hollywood standards, this film is sure to become a landmark film in Prince's career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu