twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడిలా, బానిసలా, స్నేహితుడిలా ప్రభాస్ ని చూసాను: కృష్ణం రాజు

    ప్రభాస్ పెదనాన్న, టాలీవుడ్ రెబెల్ స్టార్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఇవాళ. దాదాపు పదిహేనేళ్ళ కిందటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ బాహుబలి తో ఇప్పుడు నేషనల్ స్టార్లకి ఏమాత్రం తగ్గనంత క్రేజ్ తో నిలబడ్డాడు. అయితే ఎంత నేషనల్ స్టార్ అయినా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఇంకా కుర్రవాడే కదా. ప్రభాస్ పెదనాన్న, టాలీవుడ్ రెబెల్ స్టార్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

    Recommended Video

    ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘సాహో’ మూవీ ఫస్ట్ లుక్ ఇదే...
    పోటీపడి డ్యాన్స్ చేశాం

    పోటీపడి డ్యాన్స్ చేశాం

    ‘ఓ బర్త్ డే పార్టీలో నేను, ప్రభాస్ పోటీపడి డ్యాన్స్ చేశాం. సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా చేశాం. ఈ సంఘటన ప్రభాస్ సినిమాల్లోకి రావడానికి రెండు సంవత్సరాల ముందు జరిగింది. ‘సినిమాల్లోకి రావడం ఇష్టమేనా?' అని ప్రభాస్ ని అప్పుడు నేను అడిగితే ‘ఇష్టమే' అన్నాడు. దాంతో వైజాగ్ సత్యానంద్ గారి వద్దకు నటనలో శిక్షణకు పంపించాం.

    ప్రభాస్ ని అలానే చూస్తున్నాను

    ప్రభాస్ ని అలానే చూస్తున్నాను

    ‘మామూలుగా కొడుకును ఐదు సంవత్సరాల వరకు దేవుడిలా చూడాలి, ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలి, పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్నేహితుడిలా చూడాలి' అని మా నాన్నగారు నాకు చెప్పే వారు. మా నాన్నగారు నన్ను అలానే చూశారు, ప్రభాస్ ని నేనూ అలానే చూస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.

    మూడు మాటలు చెబుతాను

    మూడు మాటలు చెబుతాను

    ‘ప్రభాస్ గురించి మూడే మూడు మాటలు చెబుతాను. ఒకటి... అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్. ప్రభాస్ తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. రెండు.. సినిమాకు సంబంధించిన కథను ప్రతి హీరో వింటాడు. ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం కాదు.

    ప్రభాస్ పర్ఫెక్ట్

    ప్రభాస్ పర్ఫెక్ట్

    అలా జడ్జ్ చేయడంలో ప్రభాస్ పర్ఫెక్ట్. ఏదైనా కథను వింటే .. దానిని ఏ స్థాయికి తీసుకువెళ్లొచ్చు, ఎలా తీసుకువెళ్లొచ్చనేది ప్రభాస్ ఆలోచిస్తాడు. మూడోది.. పర్సనల్ క్యారెక్టర్. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడే తత్వం ప్రభాస్ కు లేదు. ఇంకా, ప్రభాస్ గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు.. అయామ్ వెరీ వెరీ హ్యాపీ' అన్నారు.

    ఎవరూ ఊహించనంత డబ్బులు

    ఎవరూ ఊహించనంత డబ్బులు

    ఈ మధ్య కాలంలో ప్రభాస్ వద్దకు ఒకరు వచ్చి పెద్ద మొత్తంలో డబ్బులిస్తాం నటించమని అడిగితే, అందుకు ప్రభాస్ ఒప్పుకోలేదట. ‘ప్రభాస్ ను హీరోగా పెట్టి తెలుగు, హిందీలో సినిమా తీస్తామని ఈ మధ్య ఒకళ్లు వచ్చారు. ఎవరూ ఊహించనంత డబ్బులు ప్రభాస్ కు ఇస్తామన్నారు.

     నాకు కావాల్సింది నీ డబ్బు కాదు

    నాకు కావాల్సింది నీ డబ్బు కాదు

    ‘రెండు, మూడు సినిమాలకు సరిపడా డబ్బులు ఇస్తావు సరే, ఈ సినిమా నువ్వు సరిగా తీయకపోతే? డబ్బులిచ్చాను కదా అనుకుని నీ ఇష్టమొచ్చినట్టు తీస్తే? నాకు కావాల్సింది నీ డబ్బు కాదు. నువ్వు, నీ కథ. ఫస్ట్ నాకు కథ వినిపించు. కథ మీద, నీ మీద నమ్మకం ఉంటే నేను నటిస్తా' అని వచ్చిన వ్యక్తికి ప్రభాస్ చెప్పాడు' అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

    English summary
    In a recent interview to a news channel, Krishnam Raju spoke about Prabhas Attitude, production, acting career and politics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X