»   » ట్రెడింగ్: దుమ్మురేపుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైలర్

ట్రెడింగ్: దుమ్మురేపుతున్న ‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస హిట్లతో దూసుకెళుతున్న నేచుర‌ల్ స్టార్ నాని ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టించారు. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసకుని యూట్యూబ్‌ ట్రెండింగులో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. ట్రైలర్లో నాని పెర్ఫార్మెన్స్‌ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కృష్ణ అనే మాస్ క్యారెక్టర్లో, అర్జున్ అనే రాక్‌స్టార్ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. యుద్ధం వస్తే యుద్ధం చేయాలే కానీ పద్యం పాడకూడదురా... అంటూ కృష్ణ చెప్పే డైలాగులు, సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం రెండూ ఒకటే అంటూ అర్జున్ చెప్పే డైలాగులు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్ 12న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Krishnarjuna Yuddham Trailer crossed 1 million views. The movie starring Starring : Nani, Anupama Parameswaran, Rukshar Dhillon, Writer & Director : Merlapaka Gandhi, Producers : Sahu Garapati, Harish Peddi, Presenter : Venkat Boyanapalli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X