»   » కృష్ణార్జున యుద్ధం క్లోజింగ్ కలెక్షన్స్.. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే!

కృష్ణార్జున యుద్ధం క్లోజింగ్ కలెక్షన్స్.. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే!

Subscribe to Filmibeat Telugu

నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ఆ మధ్యన మంచి అంచనాలతో విడుదలయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నా నానికి కృష్ణార్జున యుద్ధం చిత్రం బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. ఎంసీఏ చిత్రం వరకు నాని విజయపరంపర కొనసాగింది. కాగా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కృష్ణార్జున యుద్ధం చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Krishnarjuna Yuddham Collections Finding a Bit Tough

కానీ ఈ చిత్రానికి మొదటిషో నుంచే డివైడ్ టాక్ రావడంతో పరిస్థితి మారిపోయింది. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్ర వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకు జరిగింది. కానీ అన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లకు 50 శాతం వరకు నాశం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Krishnarjuna Yudham Worldwide Closing Collections

కృష్ణార్జున యుద్ధం చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 14 కోట్ల వరకు షేర్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల షేర్ రాబట్టింది. నాని గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి సరైన ఆదరణ లభించలేదు.

English summary
Krishnarjuna Yudham Worldwide Closing Collections. Huge disappointment for Nani in recent times
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X