»   » మహేష్ బాబుతో రానిది...మెగా హీరోలతో వస్తుందనే ఆశ!

మహేష్ బాబుతో రానిది...మెగా హీరోలతో వస్తుందనే ఆశ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓటిమి పాలైన తర్వాత గెలుస్తామనే ఆశ లేకుంటే ముందుకు సాగడం కష్టమే. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో తొలి సినిమా అవకాశం దక్కగానే ఎంతో సంతోషం. అంతలోనే సినిమా నడవలేదనే బాధ. అయినా సరే విజయం దక్కుతుందనే ఆశతో ముందుకు సాగుతోంది హీరోయిన్ క్రితి సానన్. మహేష్ బాబు '1' సినిమా ద్వారా క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రితి సానన్ మెగా హీరోల సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో క్రితి సానన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలోనూ క్రితి సానన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

Kriti Sanon eye on Mega Heros

ఏకంగా ఇద్దరు మెగా హీరోల సరసన అవకాశం రావడంతో ఈ సారి తనను విజయం తప్పకుండా వరిస్తుందనే ఆశ పడుతోంది క్రతి సానన్. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఈ సారైనా ఈ భామకు విజయం దక్కాలని కోరుకుందాం.

ప్రస్తుతం క్రితి సానన్ హిందీలో 'Heropanti' అనే చిత్రంలో నటిస్తోంది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు.

English summary
Kriti is going to play opposite Allu Arjun which is being made in the direction of Trivikram Srinivas. Not only that, she has been opted to play opposite Ram Charan in his next flick with Srinu Vaitla after Krishna vamsi, says source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu