»   » షూటింగ్‌లో గాయపడిన '1 నేనొక్కిడినే' హీరోయిన్

షూటింగ్‌లో గాయపడిన '1 నేనొక్కిడినే' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సరసన 1 నేనొక్కిడినే చిత్రంలో నటించిన కృతి సనన్ గుర్తుంది కదా. ఆ తర్వాత ఆమె నాగ చైతన్య తో దోచెయ్ చిత్రం చేసింది. కానీ తెలుగులో కంటిన్యూగా ఆఫర్స్ రాకపోవటంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

అందులో బాగంగా కృతిసనన్‌ ప్రస్తుతం సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి జంటగా రాబ్తా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతోంది. సినిమాలో కృతి ఓ భవనంపైకి ఎక్కి పరిగెత్తే సన్నివేశం చేయాల్సి ఉంది. షూటింగ్ సమయంలో కృతి ప్రమాదవశాత్తూ కిందపడింది.

Kriti Sanon gets injured on 'Raabta' set

అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకపోయినా కాలికి స్వల్ప గాయమైంది. చిత్రబృందం వెంటనే వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దినేశ్‌ విజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Kriti Sanon, who was shooting in the Hungarian city, sustained injuries while sprinting across the roof of a castle. She lost her grip and as a result, crashed into the safety mat, twisting her ankle in the process. The actress has been advised rest for a couple of days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu