»   » పోస్టర్ వివాదం: సమంత వ్యాఖ్యలపై క్రితి సానన్ స్పందన

పోస్టర్ వివాదం: సమంత వ్యాఖ్యలపై క్రితి సానన్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు, క్రితి సానన్ జంటగా నటిస్తున్న '1-నేనొక్కడినే' సినిమాలోని ఓ సీన్ మహిళలను కించపరిచే విధంగా ఉందని...దుమూరం చెలరేగిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన పోస్టర్లలో మహేష్ బాబు సముద్రం ఒడ్డున నడుస్తుంటే, ఆయన కాళ్ల వెనక హీరోయిన్ క్రితిసానన్ కుక్కలా పాకడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. సినిమా హీరోయిన్ సమంత, శేఖర్ కమ్ముల, సిద్ధార్థ తదితరులు సైతం ఈ పోస్టర్ పై విమర్శలు చేసారు.

ఈ అభ్యంతరాలపై తాజాగా హీరోయిన్ క్రితి సానన్ కూడా స్పందించింది. 'మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఇటీవల విడుదలైన పోస్టర్లో తప్పేమీ లేదు. అది సినిమాలోని పాటలో ఓ భాగం. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం స్పష్టమవుతుంది' అన్నారు.

ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.....'ఆ పోస్టర్ వల్ల ఎవరి మనో భావాలైనా దెబ్బతింటే సారీ చెబుతున్నాను. వాస్తవానికి అందులో తప్పేమీ లేదు. సినిమాలో సాంగు పూర్తిగా చూస్తే ఆ సీన్లో తప్పులేదని అందరికీ అర్థమవుతుంది' అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.

సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. '1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

English summary
‘Why would I do anything that disrespect women in any manner? The picture portrayed in the poster is just part of a song and once you watch the song, you will understand that it does not disrespect women. It goes with the lyrics and that’s the reason I did it.’ Moving on to poster, she said, ‘Making the poster was a creative decision.’ Kriti Sanon reacted on '1' poster controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu